Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccc158bda5-c867-49d6-acf5-25c5a83d3577-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccc158bda5-c867-49d6-acf5-25c5a83d3577-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. వరల్డ్ క్రికెట్లో ఛాంపియన్ టీమ్స్ లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఇటీవల జరిగిన మ్యాచ్లో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే.. వరల్డ్ కప్ ప్రారంభంలో వరుసగా రెండు ఓటములతో సతమతమైన ఆస్ట్రేలియా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత మాత్రం జట్టులోని లోపాలను గమనించి అనూహ్యంగా పుంజుకుంది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు విజయాలు సాధించి అదరగొట్టింది. ఈ క్రమంలోనే పాయింట్లో పట్టికలో కూడా తమ స్థానIcc{#}Champion;Netherlands;Athadu;Australia;World Cup;Golfఆస్ట్రేలియాకు భారీ షాక్.. సెంచరీ వీరుడు దూరం?ఆస్ట్రేలియాకు భారీ షాక్.. సెంచరీ వీరుడు దూరం?Icc{#}Champion;Netherlands;Athadu;Australia;World Cup;GolfThu, 02 Nov 2023 13:00:00 GMTప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. వరల్డ్ క్రికెట్లో ఛాంపియన్ టీమ్స్ లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఇటీవల జరిగిన మ్యాచ్లో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే.. వరల్డ్ కప్ ప్రారంభంలో వరుసగా రెండు ఓటములతో సతమతమైన ఆస్ట్రేలియా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత మాత్రం జట్టులోని లోపాలను గమనించి అనూహ్యంగా పుంజుకుంది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు విజయాలు సాధించి అదరగొట్టింది.


 ఈ క్రమంలోనే పాయింట్లో పట్టికలో కూడా తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ అంతకు అందుకు పైకి దూసుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా పాయింట్లు పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఆస్ట్రేలియా రన్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది. ఇక ఇలా వరుస విజయాలతో సెమీస్ బెర్త్ కన్ఫార్మ్  చేసుకోవాలని పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియాకు ఇప్పుడు ఒక బిగ్ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మ్యాక్స్వెల్ గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్ కి అతను దూరం కాబోతున్నాడు.



 ఇటీవలే అతను సూపర్ సెంచరీ తో చేలరేగిపోవడంతో ఇక ఆస్ట్రేలియా మరింత పటిష్టంగా మారిందని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల గోల్ఫ్ కార్ పైనుంచి మ్యాక్సీ కింద పడటంతో గాయాల పాలైనట్లు తెలుస్తుంది. దీంతో అతడు కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని సమాచారం. కాగా ఇటీవల నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ వరల్డ్ కప్ హిస్టరీ లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు . ఇలా ఫుల్ ఫామ్ లోకి వచ్చిన స్టార్ ప్లేయర్ దూరం కావడం మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>