LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health8cae8797-8cf6-44cc-8922-1da72acb9e8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health8cae8797-8cf6-44cc-8922-1da72acb9e8b-415x250-IndiaHerald.jpgమనకు కాలానుగుణంగా దొరికే పండ్లల్లో రామఫలం కూడా ఒకటి. ఇక ఈ ఫలం ఎక్కువగా మనకు ఎక్కువగా శీతాకాలంలో లభిస్తుంది. ఈ రామఫలం చూడడానికి ఎర్రగా ఉంటుంది.ఇది అడువుల్లో లభిస్తుంది. అడవుల నుండి తీసుకొచ్చి వీటిని పట్టణాల్లో అమ్ముతూ ఉంటారు.సీతాఫలం వలె రామఫలాన్ని కూడా ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.రామఫలంలో చాలా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.రామఫలాన్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకHealth{#}Vitamin C,Cholesterol,Shakti,Sugar,Heart,Manamరామఫలం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు?రామఫలం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు?Health{#}Vitamin C,Cholesterol,Shakti,Sugar,Heart,ManamThu, 02 Nov 2023 19:57:01 GMTమనకు కాలానుగుణంగా దొరికే పండ్లల్లో రామఫలం కూడా ఒకటి. ఇక ఈ ఫలం ఎక్కువగా మనకు ఎక్కువగా శీతాకాలంలో లభిస్తుంది. ఈ రామఫలం చూడడానికి ఎర్రగా ఉంటుంది.ఇది అడువుల్లో  లభిస్తుంది. అడవుల నుండి తీసుకొచ్చి వీటిని పట్టణాల్లో అమ్ముతూ ఉంటారు.సీతాఫలం వలె రామఫలాన్ని కూడా ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.రామఫలంలో  చాలా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.రామఫలాన్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


రామఫలాన్ని తీసుకోవడం వల్ల చర్మం ఇంకా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు చిట్లడం, రాలడం వంటివి ఈజీగా తగ్గుతాయి. దీనివల్ల మొటిమలు తొలగిపోవడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇంకా వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ముఖవచ్చస్సు కూడా మరింతగా పెరుగుతుంది. అదే విధంగా డయాబెటిస్ తో బాధపడే వారికి ఈ పండు చాలా మేలు చేస్తుంది. డయాబెటిస్ తో బాధపడే వారు పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా పెరుగుతాయని పండ్లకు దూరంగా ఉంటారు.కానీ వారు రామఫలాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. రామఫలం డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. ఇంకా అలాగే ఈ పండును తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇంకా దీనిలో అధికంగా ఉండే విటమిన్ సి మనల్ని శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి కాపాడడంలో దోహదపడుతుంది.ఈ రామఫలంలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అంతేకాకుండా మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ కారణంగా శరీరానికి నష్టం కలగకుండా కాపాడడంలో కూడా ఈ పండ్లు మనకు సహాయపడతాయి. ఇంకా అదే విధంగా రామఫలాన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇంకా గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా ఈజీగా కరిగిపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>