DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/usa1113d868-99ad-4792-aacc-d39b6b6bfb3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/usa1113d868-99ad-4792-aacc-d39b6b6bfb3e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రెండు యుద్ధాలు జరుగుతున్నాయని మనందరకీ తెలిసిందే. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవిరామంగా కొనసాగుతుంది. సుమారు 600 రోజులకు పైగా ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 10వేల మంది మరణించగా 18వేల మంది వరకు గాయపడ్డారని తెలుస్తోంది. దీనికి తోడు ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడం.. దానికి ప్రతిగా తనదైన శైలిలో ఇజ్రాయెల్ ప్రతిదాడి మొదలు పెట్టడంతో యుద్ధం మొదలైంది. ఇవి రెండు దాడులగా కాకుండా యుద్ధాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇరువురు ఒకరిపై ఒకరు బాంబుల దాడులను కొనసాగిUSA{#}Russia;American Samoa;Iran;Israel;warఅమెరికాకే చుక్కలు చూపిస్తున్న ముస్లిం దేశాలు?అమెరికాకే చుక్కలు చూపిస్తున్న ముస్లిం దేశాలు?USA{#}Russia;American Samoa;Iran;Israel;warThu, 02 Nov 2023 23:00:00 GMTప్రస్తుతం రెండు యుద్ధాలు జరుగుతున్నాయని మనందరకీ తెలిసిందే.  ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవిరామంగా కొనసాగుతుంది. సుమారు 600 రోజులకు పైగా ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 10వేల మంది మరణించగా 18వేల మంది వరకు గాయపడ్డారని తెలుస్తోంది.  దీనికి తోడు ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడం.. దానికి ప్రతిగా తనదైన శైలిలో ఇజ్రాయెల్ ప్రతిదాడి మొదలు పెట్టడంతో యుద్ధం మొదలైంది.


ఇవి రెండు దాడులగా కాకుండా యుద్ధాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇరువురు ఒకరిపై ఒకరు బాంబుల దాడులను కొనసాగిస్తున్నారు.  వాస్తవానికి హమాస్ తీవ్రవాదులు వర్సెస్ ఇజ్రాయెల్ గా చెప్పాలి కానీ పాలస్తీనా తో అని చెబుతున్నారు. ఇవే కాకుండా మరో రెండు యుద్ధాలు చేసేందుకు ఆయా దేశాలు సిద్ధంగా ఉన్నాయి.  అవి తైవాన్ పై చైనా… దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా. ప్రస్తుతానికి ఇరు దేశాలు దాడులు చేసుకోవడం లేదు కానీ.. యుద్ధ సన్నాహాలు మాత్రం మొదలు పెట్టాయి.


సిరియాలోని అమెరికా స్థావరాలపై హౌతీ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ హౌతీ తీవ్రవాదులకు ఇరాన్  మద్దతుగా ఉంటుంది. దీనికి బదులుగా అమెరికా వాళ్లకి సంబంధించిన శిబిరాలపై దాడులు చేసింది. ఇరాన్ కి సంబంధించిన ఆయా దళాలు అమెరికా స్థావరాలపై తమ యుద్ధ విమానాలతో బాంబు దాడి చేసింది.


ఇప్పుడు అమెరికా చూస్తూ ఉంటుందా. ప్రతి దాడి కచ్చితంగా చేస్తోంది. చిన్నగా మొదలైన ఈ దాడులు సిరియాపై అమెరికా దాడిలా మారిపోతుంది. మూడో యుద్ధంగా అవతరించే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ పాలకుడికి జో బైడెన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా దళాలకు ఎదురొస్తే తగిన రీతిలో స్పందిస్తామని అందుకు సిద్ధంగా ఉండాలని అయాతుల్లాను హెచ్చరిస్తున్నా అని పేర్కొన్నారు. తమ దేశానికి ఆత్మరక్షణ ఎప్పుడూ ఉంటుందని.. దాడి డ్రోన్లతోనా.. రాకెట్లతోనా అనేది త్వరలో నిర్ణయిస్తామని అమెరికా తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>