Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/moviesd2e3c5bb-5e92-4fb5-ab52-39ce284d25ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/moviesd2e3c5bb-5e92-4fb5-ab52-39ce284d25ac-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్లకు ఉండే హవా అంతా ఇంతా కాదు. సినీ ప్రేక్షకులందరూ కూడా అందరికీ తెలిసిన సెలబ్రిటీల గురించి తెలియని విషయాలు తెలుసుకునేందుకు బయోపిక్ లకు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. అయితే దర్శక నిర్మాతలు కూడా ఇటీవల కాలంలో ఇలా బయోపిక్లకే మొదటి ప్రాధాన్య ఇస్తున్నారు అని చెప్పాలి. ఎందుకంటే బయోపిక్ అంటే నిజ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించాల్సి ఉంటుంది. దీంతో కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఉన్న దాంట్లోనే కాస్త సినిమాటిక్ మార్పులు చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఇక బయోపిక్లపైMovies{#}MS Dhoni;jeevitha rajaseskhar;praveen;Hyderabad;Audi;lord siva;Shiva;Tamil;raja;Cinemaత్వరలో నటరాజన్ బయోపిక్.. హీరో ఎవరంటే?త్వరలో నటరాజన్ బయోపిక్.. హీరో ఎవరంటే?Movies{#}MS Dhoni;jeevitha rajaseskhar;praveen;Hyderabad;Audi;lord siva;Shiva;Tamil;raja;CinemaThu, 02 Nov 2023 09:30:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్లకు ఉండే హవా అంతా ఇంతా కాదు. సినీ ప్రేక్షకులందరూ కూడా అందరికీ తెలిసిన సెలబ్రిటీల గురించి తెలియని విషయాలు తెలుసుకునేందుకు బయోపిక్ లకు బ్రహ్మరథం  పడుతూ ఉంటారు. అయితే దర్శక నిర్మాతలు కూడా ఇటీవల కాలంలో ఇలా బయోపిక్లకే మొదటి ప్రాధాన్య ఇస్తున్నారు అని చెప్పాలి. ఎందుకంటే బయోపిక్ అంటే నిజ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించాల్సి ఉంటుంది. దీంతో కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఉన్న దాంట్లోనే కాస్త సినిమాటిక్ మార్పులు చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఇక బయోపిక్లపై అటు ప్రేక్షకుల్లో ప్రమోషన్స్ లేకుండానే అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి.


 సినీ, రాజకీయ, క్రీడ రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్లను తీశాము అంటే ఇక సూపర్ హిట్ కొట్టొచ్చు అని దర్శక నిర్మాతలు కూడా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. కాగా ఇప్పటికే క్రీడారంగానికి చెందిన పలువురు బయోపిక్ లు సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, ప్రవీణ్ తాంబే ఇలా ఎంతో మంది భారత క్రికెటర్ల బయోపిక్ లు ప్రేక్షకులను అలరించి మంచి విజయాలను సాధించాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో టీమిండియా క్రికెటర్ బయోపిక్ కూడా తెరకెక్కించేందుకు  సన్నహాలు జరుగుతున్నాయట. ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడి తన యార్కర్లతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు నటరాజన్.


 ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలో టీమిండియాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇక ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో ఛాన్స్ దక్కించుకుని అరుదైన రికార్డు సృష్టించాడు. కానీ ఆ తర్వాత గాయాల బెడద వేధించడంతో టీమ్ ఇండియాకు సెలెక్ట్ కాలేకపోతున్నాడు.  ఈ క్రమంలోనే ఈ ఫాస్ట్ బౌలర్ బయోపిక్ త్వరలో రూపొందనూన్నట్లు తెలుస్తుంది. ఈ బయోపిక్ లో నటరాజన్ గా  తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తాడని.. అరుణ్ రాజా కామరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>