SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indian-bowlers-created-history1e042d3a-0223-420a-91e8-e473431fbc00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indian-bowlers-created-history1e042d3a-0223-420a-91e8-e473431fbc00-415x250-IndiaHerald.jpgనేడు టీమిండియా పేస్ బౌలర్లు సిరాజ్, బుమ్రాను చూస్తేనే వణికిపోయింది శ్రీలంక.ఇక ఆసియా కప్ ఫైనల్లో కేవలం 50 పరుగులకే కుప్పకూలిన ఆ టీమ్..వరల్డ్ కప్ మ్యాచ్ లో కూడా అలాగే తలవంచింది. 358 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లంక.. తొలి బంతికే వికెట్ ని కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన బంతితో ఓపెనర్ నిస్సంకను సింపుల్ గా ఔట్ చేశాడు.ఓ వరల్డ్ కప్ మ్యాచ్ లో ప్రత్యర్థిని మొదటి బంతికే ఔట్ చేసిన తొలి ఇండియన్ బౌలర్ గా బుమ్రా నిలిచాడు. ఇదే ఆశ్చర్యం అనుకుంటే.. రెండో ఓవర్లో సిరాజ్ కూడా తాను వేసిన మొదటి బంతికే వికెట్ WC 2023{#}Cricket,Ravindra Jadeja,Rohit Sharma,India,Sri Lanka,World Cup,Shreyas Iyer,Athadu,Parugu,Indianలంకని తగలబెట్టి చరిత్ర సృష్టించిన సిరాజ్, బుమ్రా..?లంకని తగలబెట్టి చరిత్ర సృష్టించిన సిరాజ్, బుమ్రా..?WC 2023{#}Cricket,Ravindra Jadeja,Rohit Sharma,India,Sri Lanka,World Cup,Shreyas Iyer,Athadu,Parugu,IndianThu, 02 Nov 2023 21:43:00 GMTనేడు టీమిండియా పేస్ బౌలర్లు సిరాజ్, బుమ్రాను చూస్తేనే వణికిపోయింది శ్రీలంక.ఇక ఆసియా కప్ ఫైనల్లో కేవలం 50 పరుగులకే కుప్పకూలిన ఆ టీమ్..వరల్డ్ కప్ మ్యాచ్ లో కూడా అలాగే తలవంచింది. 358 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లంక.. తొలి బంతికే వికెట్ ని కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన బంతితో ఓపెనర్ నిస్సంకను సింపుల్ గా ఔట్ చేశాడు.ఓ వరల్డ్ కప్ మ్యాచ్ లో ప్రత్యర్థిని మొదటి బంతికే ఔట్ చేసిన తొలి ఇండియన్ బౌలర్ గా బుమ్రా నిలిచాడు. ఇదే ఆశ్చర్యం అనుకుంటే.. రెండో ఓవర్లో సిరాజ్ కూడా తాను వేసిన మొదటి బంతికే వికెట్ తీశాడు. ఈసారి దిముత్ కరుణరత్నెను సిరాజ్ ఈజీగా ఔట్ చేశాడు. అతడు కూడా ఈజీగా డకౌటయ్యాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఓ టీమ్ లో ఇద్దరు బౌలర్లు తమ మొదటి బంతికే వికెట్ తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ ఇద్దరి ధాటికి లంక బ్యాటర్లు గజ గజ వణికిపోయారు. కొత్త బంతితో వీళ్లు డ్రాగన్ లా లంకపై నిప్పులు చెరిగారు.


ఆ టీమ్ లో మొదటి ఐదుగురు బ్యాటర్లలో ముగ్గురు డకౌట్ కాగా.. మరో ఇద్దరు అయితే కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశారు. నిస్సంక, కరుణరత్నె ఇంకా సమరవిక్రమ డకౌట్ అయ్యారు. కుశల్ మెండిస్, అసలంక చెరొక పరుగుతో మాత్రమే సరిపెట్టుకున్నారు.ఈ మ్యాచ్ తో శ్రీలంక ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో ఓ టీమ్ లో మొదటి ఐదుగురు బ్యాటర్లు కలిసి కేవలం 2 పరుగులే చేశారు. మెన్స్ క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో మొదటి ఐదుగురు బ్యాటర్లు చేసిన అతి తక్కువ పరుగులు ఇవే.ఇక అంతకుముందు టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ (4) వికెట్ కోల్పోయినా.. తర్వాత గిల్ (92) ఇంకా కోహ్లి (88) రెండో వికెట్ కు ఏకంగా 189 పరుగులు జోడించారు.అయితే ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు చేస్తారనుకున్నా.. దగ్గరగా వచ్చి ఔటయ్యారు. ఇక చివర్లో శ్రేయస్ అయ్యర్ (56 బంతుల్లోనే 82), జడేజా (24 బంతుల్లో 35) చెలరేగడంతో ఇండియా మొత్తం 8 వికెట్లకు 357 రన్స్ చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>