MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunaa67a6820-cb14-42e8-8b12-6a5b46617de3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunaa67a6820-cb14-42e8-8b12-6a5b46617de3-415x250-IndiaHerald.jpgతాజాగా హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి గొప్ప గొప్ప ప్రముఖులు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కాగా సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది. ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, వి.ఎఫ్.ఎక్స్, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజNagarjuna{#}vani;Oscar;Akkineni Nagarjuna;nag ashwin;annapurna;Darsakudu;TECHNOLOGY;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Samsung;Apple;producer;Producer;Telangana;Hyderabad;Hollywood;Tollywood;India;Director;Minister;Telugu;Cinema;Heroహైద్రాబాద్ అనేది సినిమాకు పరిశ్రమకు రాజధానిలా మారనుంది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగార్జున?హైద్రాబాద్ అనేది సినిమాకు పరిశ్రమకు రాజధానిలా మారనుంది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగార్జున?Nagarjuna{#}vani;Oscar;Akkineni Nagarjuna;nag ashwin;annapurna;Darsakudu;TECHNOLOGY;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Samsung;Apple;producer;Producer;Telangana;Hyderabad;Hollywood;Tollywood;India;Director;Minister;Telugu;Cinema;HeroWed, 01 Nov 2023 13:58:24 GMTతాజాగా హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి గొప్ప గొప్ప ప్రముఖులు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కాగా సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది. ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, వి.ఎఫ్.ఎక్స్, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున, దర్శకుడు నాగ్ అశ్విన్ అతిథులుగా విచ్చేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ డిపార్ట్‌మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సినిమాటికా ఎక్స్ పో ఫౌండర్, తెలుగు సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.జి.విందా, రోటో మేకర్ ఫౌండర్ మైక్, గ్రీన్ గోల్డ్ ఛీప్ మార్కెటింగ్ హెడ్ భరత్, కంట్రీ హెడ్ ఫర్ టెక్నికల్ బిరేన్ గోస్, జయేష్ రంజన్ ఐఏఎస్, సినిమాటోగ్రఫర్ పీజీ విందా, నాగ్ అశ్విన్, నిర్మాత సుప్రియ, డ్యాన్సింగ్ ఆటం క్రియేటివ్ హెడ్, ఫౌండర్ సరస్వతి వాణి తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే ఈ కార్యక్రమంలో భాగంగా హీరో నాగార్జున మాట్లాడుతూ.. ప్రస్తుతం రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. రోజురోజుకూ టెక్నికల్‌గా ఎన్నో మార్పులు వస్తోంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం ఎంతో సంతోషంగా ఉంది.

మొదట 1974లో అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించాము. ఒక నెలకు ఒక షూటింగ్ జరిగితే చాలనుకున్నాము  కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల పరిణామాలు వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియో కూడా ఎంతో మారింది. హైద్రాబాద్ అనేది సినిమాకు పరిశ్రమకు రాజధానిలా మారనుంది. సౌత్ ఫిల్మ్స్‌ని ఇండియా అంతా ఫాలో అవుతోంది. అదేవిధంగా నాగ్ అశ్విన్ వంటి అద్భుతమైన దర్శకులు సత్తాను చాటుతున్నారు. మేం ఆస్కార్ వరకు కూడా వెళ్ళాము. ఇండియా జాయ్ వారి గ్రాఫ్ అద్భుతంగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఎంతో సహకరిస్తున్నారు. గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ వంటి వారి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడకు రండి. మా అన్నపూర్ణ కాలేజ్‌లోనూ కోర్సులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా థాంక్స్ అని చెప్పుకొచ్చారు అక్కినేని నాగార్జున. ఈ సందర్భంగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఇండియా జాయ్ ఈవెంట్‌కు నన్ను పిలిచినందుకు థాంక్స్. నేను కూడా యానిమేషన్ కోర్సులు నేర్చుకున్నాను. వీఎఫ్‌ఎక్స్ కంపెనీల చుట్టూ కథలు పట్టుకొని మరి తిరిగాను. హాలీవుడ్‌ లాంటి క్వాలిటీతో సినిమాలు ఎందుకు చేయరని అడుగుతుంటారు. కానీ గత పదేళ్లుగా అద్భుతమైన క్వాలిటీతో సినిమాలు తీస్తున్నాము. అలాగే హాలీవుడ్ వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి చేస్తున్నారు. ప్రాజెక్ట్ కేని పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మూవీలా ఇక్కడి వీఎఫ్ఎక్స్ కంపెనీలతోనే చేద్దామని ప్రయత్నించాను. నెక్ట్స్ మూవీని ఇక్కడి వాళ్లతో కలిసి హాలీవుడ్ కంటే బెస్ట్ క్వాలిటీతో తీస్తాను అని తెలిపారు నాగ్ అశ్విన్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>