DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu5448fd14-311a-4fab-a389-5ebabb0c7b6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu5448fd14-311a-4fab-a389-5ebabb0c7b6a-415x250-IndiaHerald.jpgచంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఆయనపై మరిన్ని కేసులు రెడీ చేస్తోంది జగన్ సర్కారు. చంద్రబాబుపై కేసు పెట్టాలంటే సీఐడీకి క్షణాల్లో పని. ఎవరు ఫిర్యాదు చేస్తున్నారు. ఎప్పుడు దర్యాప్తు చేస్తున్నారో తెలుగు తమ్ముళ్లకు సైతం అంతు చిక్కడం లేదు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన చంద్రబాబు మెడకు మరో కేసు చుట్టుకుంటోంది. అదేంటంటే.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేCHANDRABABU{#}Jagan;YCP;Anti-Corruption Bureau;CBN;Amaravati;Telugu;Andhra Pradesh;Yevaruబాబుపై వరుస కేసులు రెడీ చేస్తున్న జగన్‌ సర్కార్‌?బాబుపై వరుస కేసులు రెడీ చేస్తున్న జగన్‌ సర్కార్‌?CHANDRABABU{#}Jagan;YCP;Anti-Corruption Bureau;CBN;Amaravati;Telugu;Andhra Pradesh;YevaruWed, 01 Nov 2023 09:00:00 GMTచంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఆయనపై మరిన్ని కేసులు రెడీ చేస్తోంది జగన్ సర్కారు. చంద్రబాబుపై కేసు పెట్టాలంటే సీఐడీకి క్షణాల్లో పని. ఎవరు ఫిర్యాదు చేస్తున్నారు. ఎప్పుడు దర్యాప్తు చేస్తున్నారో తెలుగు తమ్ముళ్లకు సైతం అంతు చిక్కడం లేదు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన చంద్రబాబు మెడకు మరో కేసు చుట్టుకుంటోంది.


అదేంటంటే.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబుని ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో మరోక కేసులో  ఇరుక్కున్నట్లు అయింది. ఇప్పటికే ఆయన స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు, ఫైబర్ గ్రిడ్,  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి.  


2014-19మధ్య కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏడు డిస్టిలరీ లకు అనుమతి ఇచ్చారు. ఆయన పాలనలో ఐదేళ్ల కాలంలో 254 బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు.  ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీ లకు ఏకంగా పద్నాలగింటికి అనుమతులు ఇచ్చారు. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న కారణంతో ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.  అనుమతుల విషయంలో దాదాపు రూ.3వేల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోంది. దీనికి ఇచ్చిన అనుమతుల వల్ల ప్రభుత్వానికి దక్కాల్సిన పనులకు కూడా కన్నం పడింది.  డిస్టిలరీలకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చి భారీ అవినీతికి తెరతీశారని చంద్రబాబుపై ఆరోపణ.


ఎన్నికల ముందు చంద్రబాబుపై ఈ మద్యం కేసు బయటకు తీయడం జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే మద్యం పాలసీతో వైసీపీ సర్కార్ పై చాలా విమర్శలు ఉన్నాయి. నాసిరకం మద్యం సరఫరా తదితర వాటిని పకకదోవ పట్టించేందుకు.. ఈ బ్రాండ్లకు చంద్రబాబే అనుమతి ఇచ్చారనే అనే కోణంలో వైసీపీ ప్రచారం చేసుకోనుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>