HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf4add176-7628-4107-aed4-9200400c7445-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf4add176-7628-4107-aed4-9200400c7445-415x250-IndiaHerald.jpgవిటమిన్ సి ఎక్కువగా ఉండే వివిధ రకాల పండ్లల్లో మోసంబి పండు కూడా ఒకటి. మనం వీటిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాము. ఈ మోసంబి జ్యూస్ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది.అందుకే చాలా మంది ఈ జ్యూస్ ను ఇష్టంగా తాగుతారు. మనకు జ్యూస్ సెంటర్లలల్లో కూడా మోసంబి జ్యూస్ చాలా సులభంగా లభిస్తుంది. ఇతర పండ్ల రసాలను తాగినట్టుగా మోసంబి జ్యూస్ ను కూడా తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో తప్పకుండా ఈ జ్యూస్ ని తీసుకోవాలని వారు చెబుతున్నారు. ఎందుకంటే మోసంబిలో విటమిన్ సి తో పాటు అనేక రకాHEALTH{#}Vitamin C;Pregnant;Shakti;Manam;Heartఈ జ్యూస్ తాగితే ఏ జబ్బు దరిచేరదు?ఈ జ్యూస్ తాగితే ఏ జబ్బు దరిచేరదు?HEALTH{#}Vitamin C;Pregnant;Shakti;Manam;HeartWed, 01 Nov 2023 15:46:00 GMTవిటమిన్ సి ఎక్కువగా ఉండే వివిధ రకాల పండ్లల్లో మోసంబి పండు కూడా ఒకటి. మనం వీటిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాము. ఈ మోసంబి జ్యూస్ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది.అందుకే చాలా మంది ఈ జ్యూస్ ను ఇష్టంగా తాగుతారు. మనకు జ్యూస్ సెంటర్లలల్లో కూడా మోసంబి జ్యూస్ చాలా సులభంగా లభిస్తుంది. ఇతర పండ్ల రసాలను తాగినట్టుగా మోసంబి జ్యూస్ ను కూడా తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో తప్పకుండా ఈ జ్యూస్ ని తీసుకోవాలని వారు చెబుతున్నారు. ఎందుకంటే మోసంబిలో విటమిన్ సి తో పాటు అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పండ్లతో చేసిన జ్యూస్ ను తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.శీతాకాలంలో మనలో చాలా మంది దగ్గు ఇంకా జలుబు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు.కాబట్టి ఈ సమయంలో మోసంబిజ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇంకా మనం ఎలాంటి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఇంకా అంతేకాకుండా శీతాకాలంలో చాలా మలబద్దకం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇంకా అలాగే చాలా మందికి ఎక్కువగా ఏది కూడా తినాలనిపించదు. అలాంటి వారు మోసంబి జ్యూస్ ను తాగడం వల్ల పొట్టలో కదలికలు పెరుగుతాయి.


మలబద్దకం సమస్య ఈజీగా తగ్గుతుంది. ఇంకా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. ఇంకా అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల నోట్లో ఉండే రుచి మొగ్గలు ఉత్తేజానికి గురి అవుతాయి. అందువల్ల నోటికి ఏదైనా తినాలన కోరిక కలుగుతుంది. అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల వాంతులు, వికారం ఇంకా విరోచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. మోసంబి జ్యూస్ ను తాగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది.ఇంకా గుండె సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. చాలా మంది కూడా పంచదార ఎక్కువగా ఉండే శీతల పానీయాలను తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారు శీతల పానీయాలకు బదులుగా ఈ మోసంబి జ్యూస్ ను తీసుకోవడం చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరం డీహ్రైడేషన్ కు గురి కాకుండా ఉంటుంది. శరీరంలో మలినాలు ఈజీగా తొలగిపోతాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కూడా తగ్గుతుంది. జుట్టును ఇంకా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, బరువు తగ్గడంలో కూడా మోసంబి జ్యూస్ మనకు బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ జ్యూస్ ను తాగడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా మోసంబి జ్యూస్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>