Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc3b3f6825-6ed7-4a8b-b3c5-bb5bd97824ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc3b3f6825-6ed7-4a8b-b3c5-bb5bd97824ce-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో సెమి ఫైనల్ అడుగుపెట్టబోయే టీం ఏది అంటే ప్రతి ఒక్కరు మొదట చెప్పేది భారత జట్టు గురించే. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం అలా కొనసాగుతుంది. మిగతా జట్లు ఒకటి రెండు మ్యాచ్లలో ఓడిపోతూ మిగతా మ్యాచ్ లలో విజయాన్ని సాధిస్తూ ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉంటే.. అటు భారత జట్టు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్క చేయకుండా చిత్తుగా ఓడిస్తుంది. కాగా ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటివరకు టీమిండియా సాధించిన అన్ని విజయాలు కIcc{#}Cricket;World Cup;Dookudu;Fidaa;Prasthanam;Indiaఏంటి.. అలా జరిగితే.. భారత జట్టు సెమిస్ కు వెళ్లలేదా?ఏంటి.. అలా జరిగితే.. భారత జట్టు సెమిస్ కు వెళ్లలేదా?Icc{#}Cricket;World Cup;Dookudu;Fidaa;Prasthanam;IndiaWed, 01 Nov 2023 07:45:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో సెమి ఫైనల్ అడుగుపెట్టబోయే టీం ఏది అంటే ప్రతి ఒక్కరు మొదట చెప్పేది భారత జట్టు గురించే. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం అలా కొనసాగుతుంది. మిగతా జట్లు ఒకటి రెండు మ్యాచ్లలో ఓడిపోతూ మిగతా మ్యాచ్ లలో విజయాన్ని సాధిస్తూ ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉంటే.. అటు భారత జట్టు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్క చేయకుండా చిత్తుగా ఓడిస్తుంది.


 కాగా ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటివరకు టీమిండియా సాధించిన అన్ని విజయాలు కూడా భారీ విక్టరీలే కావడం గమనార్హం. ఇక రోహిత్ తన కెప్టెన్సీ వ్యూహాలతో జట్టును నడిపిస్తున్న తీరు అందరిని ఫిదా చేస్తుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన భారత జట్టు  అన్నింటిలో కూడా విజయం సాధించింది. ఈ క్రమంలోనే 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇంతలా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నప్పటికీ.. టీమిండియా కు సెమీఫైనల్కు వెళ్లే అవకాశాలు కూడా కోల్పోయే ఛాన్స్ ఉందట. ఆరు మ్యాచులలో ఆరు విజయాలు సాధించిన తర్వాత సెమీఫైనల్ కు వెళ్లకుండా ఎలా ఉంటుంది అంటారా.


 దాని వెనక కొన్ని గణాంకాలు ఉన్నాయి అని చెబుతున్నారు క్రికెట్ నిపుణులు. వరుసగా ఆరు మ్యాచులు గెలిచిన టీమ్ ఇండియా ఇంకా సెమి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోలేదు. మరో మ్యాచ్ గెలిస్తేనే సెమిస్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది. అయితే టీమిండియా మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి.. ఉండగా ఈ మ్యాచ్ లో భారీ తేడాతో ఓడిపోయింది అంటే సెమీఫైనల్ చేరడం కష్టం. ఎందుకంటే అప్పుడు టీం ఇండియాకు 12 పాయింట్లు ఉంటాయి. మిగతా జట్లలో నాలుగు జట్లకు 12 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు ఉండి నెట్ రన్ రేట్ కూడా టీమిండియా కంటే ఎక్కువగా ఉంటే ఆ నాలుగు జట్లే సెమి ఫైనల్ కు వెళ్తాయి అని చెప్పాలి. కానీ ప్రస్తుతం టీమిండియా దూకుడు చూస్తూ ఉంటే దాదాపు మిగిలిన మూడు మ్యాచ్లలో కూడా విషయం సాధించే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>