Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pake028e259-4844-43a2-9983-3235107112be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pake028e259-4844-43a2-9983-3235107112be-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఎన్నో టీమ్స్ ప్రేక్షకుల అంచనాలను తారుమాలు చేశాయి. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆయా టీమ్స్ అద్భుతంగా రాణిస్తాయి వరుస విజయాలు సాధిస్తాయి అని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో వరుస పరాజయాలతో అందరినీ నిరాశపరిచాయి ఆయా జట్లు. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నాయ్ అని చెప్పాలి. వరల్డ్ కప్ ప్రారంభం నుంచి అంచనాలను తారుమారు చేసే ప్రదర్శన చేసిన జట్టు ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ అని చెప్పాలి. భారత దPak{#}sandeep;Pakistan;Bangladesh;World Cup;Indiaరికార్డు సృష్టించిన పాకిస్తాన్ బౌలర్.. అత్యంత వేగంగా?రికార్డు సృష్టించిన పాకిస్తాన్ బౌలర్.. అత్యంత వేగంగా?Pak{#}sandeep;Pakistan;Bangladesh;World Cup;IndiaWed, 01 Nov 2023 07:30:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఎన్నో టీమ్స్ ప్రేక్షకుల అంచనాలను తారుమాలు చేశాయి. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆయా టీమ్స్ అద్భుతంగా రాణిస్తాయి వరుస విజయాలు సాధిస్తాయి అని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో వరుస పరాజయాలతో  అందరినీ నిరాశపరిచాయి ఆయా జట్లు. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నాయ్ అని చెప్పాలి. వరల్డ్ కప్ ప్రారంభం నుంచి అంచనాలను తారుమారు చేసే ప్రదర్శన చేసిన జట్టు ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ అని చెప్పాలి.



 భారత దాయాధి దేశమైన పాకిస్తాన్ జట్టు ఏకంగా టీమిండియాను సొంత గడ్డ పైన దెబ్బ కొట్టి వరల్డ్ కప్ గెలవాలి అనే కసితో ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ టోర్నీలో బరిలోకి దిగింది. కానీ ఊహించని రీతిలో ఆ జట్టుకు ఏకంగా వరుసగా నాలుగు పరాజయాలు చవి చూసి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అని చెప్పాలి. దీంతో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన పై సొంత దేశ అభిమానులు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పరాజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఏడూ వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్.


 దీంతో ఆ జట్టు సెమీఫైనల్ అవకాశాలు ప్రస్తుతం సజీవంగానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే బంగ్లాదేశ్ మ్యాచ్ లో పాకిస్తాన్ తురుపు ముక్కగా పిలుచుకునే బౌలర్ షాహీన్ ఆఫ్రిది అరుదైన రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా 51 మ్యాచ్లలో 100 వికెట్లు సాధించిన బౌలర్గా  రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ఈ లిస్టులో అతని తర్వాత స్టార్క్ 52, సక్లైన్ ముస్తాక్ 53 ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ జాబితాలో స్పిన్నర్లు సందీప్ లామిచానే 41,  రషీద్ ఖాన్ 44 మ్యాచ్లలో 100 వికెట్లు సాధించిన ప్లేయర్లుగా టాప్ 2లో ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>