MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthi5429b6cb-8b33-4f34-acc7-5b676c552a8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthi5429b6cb-8b33-4f34-acc7-5b676c552a8b-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు కార్తి తాజాగా జపాన్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. అలాగే ఒక పాటను కూడా విడుదల చేసింది. వీటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి రెండవ సాంగ్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని రెండవ పాట అKarthi{#}Karthik;Japan;king;Music;Karthik Siva Kumar;Box office;Kumaar;cinema theater;Blockbuster hit;Diwali;Telugu;Evening;annapurna;Cinema"జపాన్" సెకండ్ సింగిల్ విడుదల తేదీ... సమయాన్ని ప్రకటించిన మూవీ మేకర్స్..!"జపాన్" సెకండ్ సింగిల్ విడుదల తేదీ... సమయాన్ని ప్రకటించిన మూవీ మేకర్స్..!Karthi{#}Karthik;Japan;king;Music;Karthik Siva Kumar;Box office;Kumaar;cinema theater;Blockbuster hit;Diwali;Telugu;Evening;annapurna;CinemaWed, 01 Nov 2023 08:40:00 GMTతమిళ నటుడు కార్తి తాజాగా జపాన్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. అలాగే ఒక పాటను కూడా విడుదల చేసింది. వీటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి రెండవ సాంగ్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా విడుదల చేసింది.

మూవీ మేకర్స్ ఈ సినిమా లోని రెండవ పాట అయినటువంటి "చక్రాలాంటి" అనే సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ కి రాజు మురుగన్ దర్శకత్వం వహించగా ... అను ఇమ్మాన్యూయల్ ఈ మూవీ లో కార్తీ కి జోడిగా నటించింది. జీవి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం సర్దార్ మూవీ.తో ప్రేక్షకులను పలకరించిన కార్తీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

సర్దార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత కార్తీక్ నటించిన మూవీ కావడంతో జపాన్ మూవీ పై ఆయన అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ నటుడు జపాన్ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ మూవీ ని తెలుగు లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ వారు విడుదల చేయనున్నారు. ఈ సంస్థ వారు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>