Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc822d06c1-0216-49bb-bc35-e8782f432328-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc822d06c1-0216-49bb-bc35-e8782f432328-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పోరు ఎంతో రసవత్తరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటికే వరల్డ్ కప్ లో సగానికి పైగా మ్యాచ్లు ముగిసాయి. దీంతో సెమీఫైనల్ వెళ్ళబోయే జట్లు ఏవి అనేదానిపైనే ఉత్కంఠ నెలకొంది. అయితే మొన్నటి వరకు వరుస ఓవటములతో సతమతమైన టీమ్స్ సైతం ఇక ఎప్పుడు సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ ముందుకు సాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ఊహించలేము. దీంతో సెమి ఫైనల్ వెళ్లబోయే టీమ్స్ ఏవి అన్నది ముందుగా అంచనా వేసినIcc{#}ravi anchor;England;Champion;ravi shastri;Yevaru;Cricket;World Cup;Indiaవరల్డ్ కప్ పోయింది.. ఇంగ్లాండ్ కనీసం దానికోసమైన ఆడాలి : రవి శాస్త్రివరల్డ్ కప్ పోయింది.. ఇంగ్లాండ్ కనీసం దానికోసమైన ఆడాలి : రవి శాస్త్రిIcc{#}ravi anchor;England;Champion;ravi shastri;Yevaru;Cricket;World Cup;IndiaWed, 01 Nov 2023 08:05:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పోరు ఎంతో రసవత్తరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటికే వరల్డ్ కప్ లో సగానికి పైగా మ్యాచ్లు ముగిసాయి. దీంతో సెమీఫైనల్ వెళ్ళబోయే జట్లు ఏవి అనేదానిపైనే ఉత్కంఠ నెలకొంది. అయితే మొన్నటి వరకు వరుస ఓవటములతో సతమతమైన టీమ్స్ సైతం ఇక ఎప్పుడు సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ ముందుకు సాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ఊహించలేము. దీంతో సెమి ఫైనల్ వెళ్లబోయే టీమ్స్ ఏవి అన్నది ముందుగా అంచనా వేసిన కూడా అది తారుమారు కావడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


 అయితే ఇలా చిన్నచిన్న టీమ్స్ సైతం సెమీఫైనల్ లో అడుగు పెట్టేందుకు హోరాహోరీ పోరను కొనసాగిస్తూ ఉంటే డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రపంచ కప్ టోర్నిలో అడుగుపెట్టిన ఇంగ్లాండు మాత్రం దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. వరుస ఓటములతో తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులందరినీ కూడా నిరాశలో ముంచేసింది. ఇక ఇప్పటికే వరుస ఓవటములతో ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్ అవకాశాలను కూడా కోల్పోయింది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ ఇంకా మ్యాచ్లు ఆడాల్సి ఉన్నప్పటికీ అవి కేవలం నామమాత్రమైన మ్యాచ్ లే కావడం గమనార్హం.


 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ వైఫల్యం గురించి భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్ర స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది అంటూ అభిప్రాయపడ్డాడు. చిన్న జట్లపై కూడా ఇంగ్లాండు ఓడిపోవడం నిజంగా బాధాకరం. వీరు ప్రపంచ ఛాంపియన్స్ అంటే ఎవరు నమ్మరు. ఇప్పటికే ఆ జట్టు పాయింట్ల పట్టికలో అడుగున ఉంది. కింది నుంచి రెండో స్థానంలో ఉంటే ఇంగ్లాండ్ టీం ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్లే. అందుకే ఇంగ్లాండ్ కనీసం పరువు నిలబెట్టుకునేందుకు అయినా ఆడాలి అంటూ రవి శాస్త్రి సూచించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>