PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-telangana-jail-eb7ab180-6643-4dae-841d-896711d345d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-telangana-jail-eb7ab180-6643-4dae-841d-896711d345d0-415x250-IndiaHerald.jpgఅయితే రెండో రికార్డు తాజా నిర్ణయమనే చెప్పాలి. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే తెలంగాణా ఎన్నికల్లో పోటీనుండి తప్పుకోవటమే. పార్టీకి ఎంతో ఘనచరిత్ర ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలోనే తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ పోటీచేయకూడదని నిర్ణయించింది. ఒక రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని యాక్టివ్ గా ఉండే ఏ పార్టీ కూడా అనుకోదు. అలా అనుకుందంటే కచ్చితంగా అది ఆత్మహత్యతో సమానమనే చెప్పాలి. chandrababu telangana jail {#}Andhra Pradesh;TDP;CBN;Congress;Partyఅమరావతి : చంద్రబాబు నాయకత్వంలో రెండో చెత్త రికార్డా ?అమరావతి : చంద్రబాబు నాయకత్వంలో రెండో చెత్త రికార్డా ?chandrababu telangana jail {#}Andhra Pradesh;TDP;CBN;Congress;PartyWed, 01 Nov 2023 09:00:00 GMT

ఎన్టీయార్ నుండి తెలుగుదేశంపార్టీ పగ్గాలు చంద్రబాబునాయుడు లాక్కున్న తర్వాత రెండు పరమచెత్త రికార్డులను నమోదయ్యాయి. ఈ రెండు రికార్డులు కూడా చంద్రబాబు నాయకత్వ లక్షణాలను స్పష్టంగా చెబుతున్నాయి. ఇంతకీ ఆ పరమచెత్త రికార్డులు ఏమిటంటే మొదటిది చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా 2019లో ఓడిపోవటం. 175 సీట్ల అసెంబ్లీలో టీడీపీకి అత్యంత తక్కువగా 23 సీట్లు మాత్రమే దక్కాయంటే పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో అర్ధమవుతోంది. సరే ఇపుడీ రికార్డు చరిత్రగా మిగిలిపోయింది.





అయితే రెండో రికార్డు తాజా నిర్ణయమనే చెప్పాలి. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే తెలంగాణా ఎన్నికల్లో పోటీనుండి తప్పుకోవటమే. పార్టీకి ఎంతో ఘనచరిత్ర ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలోనే తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ పోటీచేయకూడదని నిర్ణయించింది. ఒక రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని యాక్టివ్ గా ఉండే ఏ పార్టీ కూడా అనుకోదు. అలా అనుకుందంటే కచ్చితంగా అది ఆత్మహత్యతో సమానమనే చెప్పాలి. 





నిజానికి తెలుగుదేశంపార్టీ పరిస్ధితి తెలంగాణాలో  చాలా దయనీయంగా  ఉందనే చెప్పాలి. అయినా సరే పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో కొద్దో గొప్పో ఓటుబ్యాంకు ఉందని ఇంకా ప్రచారం జరుగుతోంది. ఆమధ్య ఖమ్మంలో బహిరంగసభ నిర్వహిస్తే జనాలు బాగానే వచ్చారు. అప్పటినుండే తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ మళ్ళీ పుర్వవైభం సాధిస్తుందని చంద్రబాబే చెప్పారు. అలాంటిది సడెన్ గా పోటీనుండి టీడీపీ దూరంగా ఉంటుందని నిర్ణయించటమంటే ఆశ్చర్యంగానే ఉంది.




తాజా  నిర్ణయప్రభావం రాబోయే ఏపీ ఎన్నికల మీద తప్పకుండా పడతుంది అనటంలో సందేహంలేదు. స్కిల్ స్కామ్ లో ఇరుక్కుని 50 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో తెలీటంలేదు.  దాంతో తెలంగాణా ఎన్నికల్లో పోటీ అంటేనే భయపడిపోయారు. ఎన్నికల్లో  దిగితే పూర్తిస్ధాయిలో యుద్ధంచేసే  పరిస్ధితి  లేదు. అందుకనే పోటీకి దూరంగా ఉంటేనే మేలని అనుకున్నారు. నిజానికి ఎన్నికల్లో దూరంగా ఉండాలని  టీడీపీ నిర్ణయం వెనుక హిడెన్ అజెండా కాంగ్రెస్ ను గెలిపించటమే అనే ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలనే రెండో చెత్త రికార్డు కూడా నమోదైంది వాస్తవం. 




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>