Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crick-e091a42e-e406-4c34-adf3-3947ba819996-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crick-e091a42e-e406-4c34-adf3-3947ba819996-415x250-IndiaHerald.jpgఒక వైపు టీమిండియా ప్రస్తుతం సొంత గడ్డమీద జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టులోని ఆటగాళ్లు అందరు కూడా ఫుల్ ఫామ్ కనబరుస్తూ అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ఇలా ఒకవైపు వరల్డ్ కప్ లో టీం ఇండియా ఆధారపడుతూ ఉంటే.. ఇంకోవైపు ఇక భారత క్రికెట్ లో ఉన్న యువ ఆటగాళ్లందరూ కూడా దేశ వాళి టోర్ని అయినా సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్Crick {#}Cricket;West Bengal - Kolkata;World Cup;Syed Mushtaq Ali;history;Yuva;Indian;India;Rajasthanవార్నర్ ను దాటేసిన బిల్డప్ బాబాయ్.. ప్రపంచ రికార్డ్?వార్నర్ ను దాటేసిన బిల్డప్ బాబాయ్.. ప్రపంచ రికార్డ్?Crick {#}Cricket;West Bengal - Kolkata;World Cup;Syed Mushtaq Ali;history;Yuva;Indian;India;RajasthanWed, 01 Nov 2023 07:50:00 GMTఒక వైపు టీమిండియా ప్రస్తుతం సొంత గడ్డమీద జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టులోని ఆటగాళ్లు అందరు కూడా ఫుల్ ఫామ్ కనబరుస్తూ అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ఇలా ఒకవైపు వరల్డ్ కప్ లో టీం ఇండియా ఆధారపడుతూ ఉంటే.. ఇంకోవైపు ఇక భారత క్రికెట్ లో ఉన్న యువ ఆటగాళ్లందరూ కూడా దేశ వాళి టోర్ని అయినా సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా తమ తమ  జట్లను గెలిపించుకునేందుకు  వీరోచితమైన పోరాటం చేస్తూ.. ఇక ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ సైతం అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఐపిఎల్ లో గతంలో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ సీనియర్స్ కు రెస్పెక్ట్ ఇవ్వకుండా విమర్శల పాలు అయినా రియాన్ పరాగ్ బిల్డప్ బాబాయ్ అనే ఒక ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే అతను ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం అదరగొడుతున్నాడు.



 టి20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నిలో జట్టు విజయం కోసం కీలకంగా వ్యవహరిస్తున్నాడు. టి20 క్రికెట్లోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా ఏడు అర్థ సెంచరీలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు రియాన్ పరాగ్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఇటీవల బెంగాల్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతను 50 పరుగులు చేసి రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. అతని తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ మసకజ్జా, కామ్రాన్ అక్మల్, బట్లర్, డేవిడ్ వార్నర్, కాన్వె లు ఐదు హాఫ్ సెంచరీలతో ఉన్నారు. ఇలా ఏకంగా క్రికెట్లో లెజెండ్స్ గా కొనసాగుతున్న వారి రికార్డులను సైతం బ్రేక్ చేయడంతో అతని అభిమానులందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>