Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby45f1e6e4-1c51-44f5-8575-49d84a9936c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby45f1e6e4-1c51-44f5-8575-49d84a9936c6-415x250-IndiaHerald.jpgహృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో కామెడీ ఓరియంటెడ్ సినిమాలను తీసిన దర్శకుడు సాయి రాజేష్.. ఇక ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాతో ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చి సెన్సేషన్ విజయాన్ని సాధించాడు అన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా.. ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ అందరికీ కూడా బాగా కనెక్ట్ అయిపోయిన ఈ సినిమా ప్రేక్షకులందరూ కూడా సినిమా థియేటర్లకు రప్పించడంలో సక్సBaby{#}vijay deverakonda;Love Story;Anand Deverakonda;Chaitanya;Remake;Devarakonda;Comedy;Love;Darsakudu;Blockbuster hit;Audience;Hindi;Heroine;Success;Director;Hero;Cinemaబేబీ మూవీ హిందీ రీమేక్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?బేబీ మూవీ హిందీ రీమేక్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?Baby{#}vijay deverakonda;Love Story;Anand Deverakonda;Chaitanya;Remake;Devarakonda;Comedy;Love;Darsakudu;Blockbuster hit;Audience;Hindi;Heroine;Success;Director;Hero;CinemaWed, 01 Nov 2023 11:15:00 GMTహృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో కామెడీ ఓరియంటెడ్ సినిమాలను తీసిన దర్శకుడు సాయి రాజేష్.. ఇక ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాతో ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చి సెన్సేషన్ విజయాన్ని సాధించాడు అన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా.. ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ అందరికీ కూడా బాగా కనెక్ట్ అయిపోయిన ఈ సినిమా ప్రేక్షకులందరూ కూడా సినిమా థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయింది.


 నేటితరం లవ్ స్టోరీస్ ఎలా ఉన్నాయి అన్నదాన్ని ఈ సినిమా ద్వారా సాయి రాజేష్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు.  ఇలా ఒక చిన్న సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీ 10 కోట్లతో నిర్మితమై దాదాపు 90 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది అని చెప్పాలి. ఇక హీరో ఆనంద్ దేవరకొండ కి కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఇంత పెద్ద సక్సెస్ అయిన ఈ చిన్న మూవీపై ప్రస్తుతం ఇతర భాషల డైరెక్టర్ల దృష్టి కూడా పడింది అన్నది తెలుస్తుంది. అయితే ఈ మూవీని మిగతా భాషలో రీమేక్ చేయడానికి డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారట.


 ఈ క్రమంలోనే  బేబీ మూవీ ని హిందీలో రీమేక్ చేయడానికి అటు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట.  ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయట. అయితే తెలుగులో వైష్ణవి చైతన్యకు బేబీ సినిమా ద్వారా లైఫ్ ఇచ్చిన సాయి రాజేష్ ఇక హిందీలో ఎంతో ఫేమస్ అయిన ముగ్గురు యూట్యూబర్లైన అమ్మాయిల పేర్లను పరిశీలిస్తున్నాడట. వీరిలో ఒకరిని ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. హిందీ మూవీకి కూడా సాయి రాజేశ్ దర్శకత్వం వహించబోతున్నాడట. అంతేకాదు మరో స్టార్ హీరో కొడుకుని కూడా ఈ మూవీ ద్వారా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కూడా ఉందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>