MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas71237602-bb54-44ee-817f-39296b46bc71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas71237602-bb54-44ee-817f-39296b46bc71-415x250-IndiaHerald.jpgవరసగా మూడు ఫ్లాప్ లు ఎదురైనా ప్రభాస్ సినిమాల మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు. గతంలో ప్రభాస్ తో 100 కోట్ల సినిమా అంటే ఒక షాకింగ్ న్యూస్ గా ఉండేది. అయితే ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగి పోవడంతో ఇప్పుడు అతడితో సినిమా అంటే కనీసం 300 కోట్ల వ్యవహారం ఆన్న ప్రచారం జరుగుతోంది. ఇలా భారీ బడ్జెట్ సినిమాలు ప్రభాస్ పై తీయడం ఒక సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాల పై కొనసాగుతున్న మ్యానియా వల్ల అతడితో సినిమాలు తీసే నిర్మాతలకు నష్టం రావడం లేదు కానీ ప్రభాస్ సినిమాలను కొనుక్కుprabhas{#}Prabhas;vegetable market;Christmas;Hollywood;Telugu;Cinema;Andhra Pradeshప్రభాస్ సినిమాలను కార్నర్ చేస్తున్న ఆసమస్యలు !ప్రభాస్ సినిమాలను కార్నర్ చేస్తున్న ఆసమస్యలు !prabhas{#}Prabhas;vegetable market;Christmas;Hollywood;Telugu;Cinema;Andhra PradeshWed, 01 Nov 2023 09:00:00 GMTవరసగా మూడు ఫ్లాప్ లు ఎదురైనా ప్రభాస్ సినిమాల మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు. గతంలో ప్రభాస్ తో 100 కోట్ల సినిమా అంటే ఒక షాకింగ్ న్యూస్ గా ఉండేది. అయితే ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగి పోవడంతో ఇప్పుడు అతడితో సినిమా అంటే కనీసం 300 కోట్ల వ్యవహారం ఆన్న ప్రచారం జరుగుతోంది.



ఇలా భారీ బడ్జెట్ సినిమాలు ప్రభాస్ పై తీయడం ఒక సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాల పై కొనసాగుతున్న మ్యానియా వల్ల అతడితో సినిమాలు తీసే నిర్మాతలకు నష్టం రావడం లేదు కానీ ప్రభాస్ సినిమాలను కొనుక్కున్న బయ్యర్లు చాల మటుకు నష్టపోతున్నారు అంటూ ఇండస్ట్రీలో ఒక కొత్త ప్రచారం మొదలైంది. ప్రభాస్ గత చిత్రాలతో పోలిస్తే ‘సలార్’ బడ్జెట్ చాల తక్కువైంది అని అయితే ఈ సినిమా నిర్మాతలు అత్యుత్సాహంతో ఈ మూవీని భారీ రేట్లకు అమ్మడంతో ఏపీ తెలంగాణకు కలిపి 175 కోట్లు బిజినెస్ జరిగింది అన్న మాటలు వినిపిస్తున్నాయి.  



ఇంత భారీ మొత్తానికి కొనుక్కున్న బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కు రావాలి అంటే ‘సలార్’ మూవీ కేవలం తెలుగు రాష్ట్రాలలో 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలాని అలాంటి రేంజ్ ‘సలార్’ కు ఉందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనికితోడు ‘సలార్’ కు పోటీగా ‘డంకీ’ భారీ హాలీవుడ్ మూవీ ‘ఆక్వామ్యాన్’ క్రిస్మస్ సీజన్ కు విడుదల అవుతున్న పరిస్థితులలో ‘సలార్’ బయ్యర్ల అంచనాల ప్రకారం 300 కోట్లు రావడం జరిగితే అది అద్భుతమే అంటున్నారు.



‘సలార్’ మూవీకి డివైడ్ టాక్ వచ్చి ఈ మూవీని కొనుక్కున్న బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ రాకపోతే దాని ప్రభావం ప్రభాస్ భవిష్యత్ సినిమాల మార్కెట్ పై పడి రానున్న రోజులలో ప్రభాస్ సినిమాలకు బయ్యర్లు దొరకని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అంటూ మరి కొందరు హెచ్చరిస్తున్నారు..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>