AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/renault-duster4bd03e6d-611e-425e-9e0b-78dcf3b2ad9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/renault-duster4bd03e6d-611e-425e-9e0b-78dcf3b2ad9b-415x250-IndiaHerald.jpgఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ‘రెనాల్ట్ డస్టర్’ అప్పట్లో ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే.ఈ ఎస్‌యూవీ.. భారత మార్కెట్‌లో బాగా సక్సెస్ అయింది.అయితే 2021లో ఫస్ట్ జనరేషన్ డస్టర్‌ అమ్మకాలను నిలిపివేయగా.. ప్రస్తుతం సెకండ్ జనరేషన్ డస్టర్ మాత్రం అందుబాటులో ఉంది. ఇక థర్డ్ జనరేషన్ డస్టర్‌ నవంబర్‌ 29న ఇండియన్ మార్కెట్‌లోకి రానుంది.ఈ కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.రెనాల్ట్ కంపెనీ సబ్ బ్రాండ్ అయిన ‘డాసియా’ ఈ థర్డ్ జనరేషన్ డస్టర్‌ని తయారు చేసింది. నవంబర్ 29న పోర్చుగల్‌లో ఈ కొత్త డస్టర్‌ ఎడిషRENAULT DUSTER{#}maruti;Toyota;Hyundai;Car;Petrol;Success;Indian;Novemberన్యూ రెనాల్ట్ డస్టర్ రిలీజ్ అప్పుడే..?న్యూ రెనాల్ట్ డస్టర్ రిలీజ్ అప్పుడే..?RENAULT DUSTER{#}maruti;Toyota;Hyundai;Car;Petrol;Success;Indian;NovemberTue, 31 Oct 2023 22:38:00 GMTఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ‘రెనాల్ట్ డస్టర్’ అప్పట్లో ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే.ఈ ఎస్‌యూవీ.. భారత మార్కెట్‌లో బాగా సక్సెస్ అయింది.అయితే 2021లో ఫస్ట్ జనరేషన్ డస్టర్‌ అమ్మకాలను నిలిపివేయగా.. ప్రస్తుతం సెకండ్ జనరేషన్ డస్టర్ మాత్రం అందుబాటులో ఉంది. ఇక థర్డ్ జనరేషన్ డస్టర్‌ నవంబర్‌ 29న ఇండియన్ మార్కెట్‌లోకి రానుంది.ఈ కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.రెనాల్ట్ కంపెనీ సబ్ బ్రాండ్ అయిన ‘డాసియా’ ఈ థర్డ్ జనరేషన్ డస్టర్‌ని తయారు చేసింది. నవంబర్ 29న పోర్చుగల్‌లో ఈ కొత్త డస్టర్‌ ఎడిషన్‌ను అధికారికంగా డాసియా లాంచ్ చేయనుంది. ఇక ఈ 5-సీటర్ ఎస్‌యూవీ 2025 నాటికి భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. డాసియా కంపెనీ ఈ లేటెస్ట్ డస్టర్‌ని 7-సీటర్ వెర్షన్‌లో కూడా విడుదల చేయనుంది. అయితే ఈ కారు లాంచింగ్ గురించి కంపెనీ ఇప్పటిదాకా ఏ వివరాలను కూడా వెల్లడించలేదు.


ఇక ఈ థర్డ్ జనరేషన్ డస్టర్ మూడు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వచ్చే అవకాశం ఉంది. ఇక ఇవి వేర్వేరు డ్రైవింగ్ ప్రిఫరెన్స్‌తో రానున్నాయి. ఎంట్రీ లెవల్  వచ్చేసి 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 120 bhp పవర్ అవుట్‌పుట్ అందించనుంది. రెండోది 1.2-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ 140 bhp పవర్‌ కాగా.. మూడోది 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ 170 bhp వపర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్ ఇంకా సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.ఇంటీరియర్‌ అప్‌గ్రేడ్స్‌లో స్మార్ట్‌ఫోన్ కంపాటబిలిటీ, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఇందులో ఉండనున్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లకు ఈ కారు పోటీ ఇవ్వనుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>