EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/arogya-sreec3e29e53-93b1-494a-82b2-71ff1f999a1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/arogya-sreec3e29e53-93b1-494a-82b2-71ff1f999a1c-415x250-IndiaHerald.jpgదివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక పథకం ఆరోగ్య శ్రీ. దీనివల్లే వైఎస్ఆర్ అందరి హృదయాల్లో దేవుడిలా నిలిచారు. అంతమంది తెలుగు ప్రజల ఆధారాభిమానాల్ని చూరగొన్నారు. తర్వాత ఈ పథకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో తీసే సాహసం కానీ.. పేరు మార్చే ఉద్దేశం గానీ ఎవరూ చేయలేకపోయారు. వైఎస్ తనయుడిగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మెరుగులు దిద్దుతారు అని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పది నెలలుగా పెండింగ్ లో ఉన్న ఆరోగ్య శ్రీ బకాయిలన్నింటిని సీఎం జగన్ విడుదAROGYA SREE{#}dr rajasekhar;Y. S. Rajasekhara Reddy;Corporate;TDP;YCP;Jagan;sree;Telugu;CMఏపీలో ఆరోగ్యశ్రీకి అనారోగ్యం సోకిందా?ఏపీలో ఆరోగ్యశ్రీకి అనారోగ్యం సోకిందా?AROGYA SREE{#}dr rajasekhar;Y. S. Rajasekhara Reddy;Corporate;TDP;YCP;Jagan;sree;Telugu;CMTue, 31 Oct 2023 12:00:00 GMTదివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక పథకం ఆరోగ్య శ్రీ. దీనివల్లే వైఎస్ఆర్ అందరి హృదయాల్లో దేవుడిలా నిలిచారు. అంతమంది తెలుగు ప్రజల ఆధారాభిమానాల్ని చూరగొన్నారు. తర్వాత ఈ పథకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో తీసే సాహసం కానీ.. పేరు మార్చే ఉద్దేశం గానీ ఎవరూ చేయలేకపోయారు. వైఎస్ తనయుడిగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మెరుగులు దిద్దుతారు అని అందరూ భావించారు.


అనుకున్నట్లుగానే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పది నెలలుగా పెండింగ్ లో ఉన్న ఆరోగ్య శ్రీ బకాయిలన్నింటిని సీఎం జగన్ విడుదల చేశారు.  ఆ విధంగానే రెండేళ్ల పాటు నిధులు విడుదల చేశారు.  కార్పొరేట్ ఆసుప్రతులు కూడా ఒక నెల అటు ఇటుగా చెల్లింపులు ఆలస్యం అయినా వైద్యం నిరుపేదలకు వైద్యం చేశాయి.  ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అందించే చికిత్సలు ప్రభుత్వ బోధనాసుప్రతుల్లో 133 వరకు ఉన్నాయి.


తాజాగా రెండేళ్ల నుంచి ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులో వైసీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం వహిస్తోంది.  దాదాపు రెండువేల కోట్ల రూపాయలు బకాయిలు ఉండటంతో కొన్ని ఆసుపత్రలు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపి వేస్తున్నాయని ప్రకటించారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.  దీంతో పాటు  అత్యవసర వైద్య సేవల కోసం వస్తున్న రోగులకు ఆయా ఆసుపత్రులు ఝులక్ ఇస్తున్నాయి.  ముందు రిజిస్ర్టేషన్ చేసుకోవాలని..సొంత డబ్బులు పెట్టుకోవాలని ఆయా ఆసుపత్రులు రోగులకు సూచిస్తున్నారు. ఆరోగ్య శ్రీ డబ్బులు వస్తే మీకే ఇస్తాం లేకుంటే మేం చేసేది ఏం లేదని చేతులు దులుపుకుంటున్నారు.


రాజశేఖర్రెడ్డి ఎంతో స్ఫూర్తితో తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీని ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఈ పథకాన్ని నీరుగారుస్తుంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీనిపై వైసీపీ మంత్రులు అడ్డగోలు ఆరోపణలు చేయకుండా ఆత్మపరిశీలన చేసుకోవాలి.  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>