EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp106cebcd-1787-4746-9399-0df35403f3d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp106cebcd-1787-4746-9399-0df35403f3d6-415x250-IndiaHerald.jpgవైసీపీ సామాజిక యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతుంది. పార్టీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలను తీసుకొస్తున్నారు. అయితే మహిళలకు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పనులు వదిలేసుకుని పార్టీ కార్యక్రమానికి రమ్మని పిలవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు కూడా లేవు. మహిళా గ్రూపు సభ్యులను పిలిచి సామాజిక యాత్రలో పాల్గొనేలా చేయడం వల్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం యాత్రలో పాల్గొన్న వారికి రాను పోను ఖర్చులు కూడా ఇవ్వకుండా ఫ్రీగా రమ్మనడం వల్ల వారిలో అసహనం YCP{#}Scheduled caste;YCP;Scheduled Tribes;Elections;Yatra;Party;Reddy;Ministerవైసీపీ సామాజిక యాత్ర.. ఈ ప్రశ్నలకు బదులేది?వైసీపీ సామాజిక యాత్ర.. ఈ ప్రశ్నలకు బదులేది?YCP{#}Scheduled caste;YCP;Scheduled Tribes;Elections;Yatra;Party;Reddy;MinisterMon, 30 Oct 2023 07:51:00 GMTవైసీపీ సామాజిక యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతుంది. పార్టీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలను తీసుకొస్తున్నారు. అయితే మహిళలకు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పనులు వదిలేసుకుని పార్టీ కార్యక్రమానికి రమ్మని పిలవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు కూడా లేవు. మహిళా గ్రూపు సభ్యులను పిలిచి సామాజిక యాత్రలో పాల్గొనేలా చేయడం వల్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


కనీసం యాత్రలో పాల్గొన్న వారికి రాను పోను ఖర్చులు కూడా ఇవ్వకుండా ఫ్రీగా రమ్మనడం వల్ల వారిలో అసహనం పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది. దీన్ని వైసీపీ నాయకత్వం ఆలోచించాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. అయితే వైసీపీ లో నిజంగా సామాజిక సమానత్వం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఉన్న స్వేచ్ఛ, సమానత్వం రాష్ట్ర హోం మంత్రి వనితకు ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


పార్టీలోనే సామాజిక సమానత్వం లోపించిందని చాలా మంది అనుకుంటున్నారు. సుచరిత, నారాయణ స్వామి, ఇలా ఎవరికైనా సామాజిక సమానత్వం వైసీపీలో లేదని కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే పూర్తి స్వేచ్చను అనుభవిస్తున్నారని అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే మంత్రిత్వ శాఖలకు స్వేచ్ఛ ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


బీసీ, ఎస్టీ, ఎస్సీ మంత్రులకు స్వేచ్ఛ ఉందా అని ప్రతిపక్ష పార్టీల నేతలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. సామాజికి వర్గాలకు చెందిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వగానే అయిపోదు. వారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఇవ్వాలని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మంత్రులు ఎంతమంది స్వేచ్ఛగా తమ శాఖలో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. జీవోలు పాస్ చేయగలుగుతున్నారు అంటే దీనికి లేదనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. పార్టీలో లేని సామాజిక సమానత్వం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లో ఎలా మేల్కోల్పుతారని ప్రశ్నిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>