Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep9a283ee1-86f3-4f34-b16c-8c4c69de8345-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep9a283ee1-86f3-4f34-b16c-8c4c69de8345-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ షో ప్రారంభమైంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ షో ని రెగ్యులర్గా వీక్షించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉల్టా ఫుల్టా అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే 8 వారాలను కూడా పూర్తి చేసుకుంది ఈ కార్యక్రమం. ఇక ప్రతి వారం ఏదో ఒక ట్విస్ట్ ప్రేక్షకులందరిలో కూడా షో మీ ద ఉన్న ఆసక్తిని మరింత పెంచేస్తూ ఉన్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ క్రమంలోనే ప్రతి వారం నామినేషన్స్, ఎలిమినేషన్స్ బిగ్ బాస్ ఇచ్చే టాస్కుSandeep{#}sandeep;Bigboss;Audience;Houseసందీప్ మాస్టర్.. 8 వారాలకు ఎంత సంపాదించాడో తెలుసా?సందీప్ మాస్టర్.. 8 వారాలకు ఎంత సంపాదించాడో తెలుసా?Sandeep{#}sandeep;Bigboss;Audience;HouseMon, 30 Oct 2023 18:03:00 GMTబిగ్ బాస్ షో ప్రారంభమైంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ షో ని రెగ్యులర్గా వీక్షించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉల్టా ఫుల్టా అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే 8 వారాలను కూడా పూర్తి చేసుకుంది ఈ కార్యక్రమం. ఇక ప్రతి వారం ఏదో ఒక ట్విస్ట్ ప్రేక్షకులందరిలో కూడా షో మీ ద ఉన్న ఆసక్తిని మరింత పెంచేస్తూ ఉన్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ క్రమంలోనే ప్రతి వారం నామినేషన్స్, ఎలిమినేషన్స్ బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు అన్నీ కూడా ఎంతో ఆసక్తిగా సాగిపోతున్నాయి అని చెప్పాలి.


 బిగ్ బాస్ షో మొదలైన నాటి నుంచి కూడా ప్రతివారం లేడీ కంటెస్టెంట్స్  ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఏడు వారాలపాటు ఏడుగురు లేడి కంటెస్టెంట్స్  ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ పై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఎనిమిదో వారంలో మొదటి మెయిల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సందీప్ మాస్టర్ చివరికి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చిన సందీప్ ఇక ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ జరిగిన ప్రతిసారి కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లిన కంటెస్టెంట్ ఎంత పారితోషికం తీసుకున్నాడు అన్నది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.



 ఈ క్రమంలోనే ఇటీవల ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయిన సందీప్ మాస్టర్ కూడా ఎంత పారితోషకం పుచ్చుకున్నారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారితో పోల్చి చూస్తే సందీప్ మాస్టర్ గట్టిగానే సంపాదించాడట. సందీప్ వారానికి 2.5 లక్షల పారితోషకం ఒప్పందంతో హౌస్ లోకి అడుగుపెట్టాడట. ఈ లెక్కన 8 వారాలకు గాను సందీప్ మాస్టర్ ఏకంగా 20 లక్షల వరకు పారితోషకం అందుకున్నాడని సమాచారం. అయితే ఇది బయట ఆట సందీప్ కి ఉన్న ఫేమ్ కి చెప్పుకోదగ్గ రెమ్యూనరేషన్ అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>