SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wc-20234cb4dc5c-1941-48ef-8e17-7e1ea18b541e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wc-20234cb4dc5c-1941-48ef-8e17-7e1ea18b541e-415x250-IndiaHerald.jpgలక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ ఇండియా టోర్నమెంట్‌లో అపజయం అనేది ఎరుగకుండా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అజేయంగా కొనసాగుతోంది.ఎంతో పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును ఆరంభం నుంచి భారత బౌలర్లు ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ టీంని కేవలం 129 పరుగులకే ఆలౌట్ చేశారు. దాదాపు సెమీ-ఫైనల్ టిక్కెట్‌ను ఖాయం చేసుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు తమ తరువాత మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడేందుకు ముంబైకి చేరుకుంది. నవంబర్ 2న రWC 2023{#}Kumaar;Champion;Sri Lanka;sree;Netherlands;Cricket;November;IndiaWC 2023: నెక్స్ట్ లంకతో పోరుకు భారత్ రెడీ?WC 2023: నెక్స్ట్ లంకతో పోరుకు భారత్ రెడీ?WC 2023{#}Kumaar;Champion;Sri Lanka;sree;Netherlands;Cricket;November;IndiaMon, 30 Oct 2023 17:14:00 GMTలక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్  మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ ఇండియా టోర్నమెంట్‌లో అపజయం అనేది ఎరుగకుండా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అజేయంగా కొనసాగుతోంది.ఎంతో పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును ఆరంభం నుంచి భారత బౌలర్లు ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ టీంని కేవలం 129 పరుగులకే ఆలౌట్ చేశారు. దాదాపు సెమీ-ఫైనల్ టిక్కెట్‌ను ఖాయం చేసుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు తమ తరువాత మ్యాచ్‌లో  శ్రీలంకతో తలపడేందుకు ముంబైకి చేరుకుంది. నవంబర్ 2న రోహిత్ జట్టు తమ తరువాత మ్యాచ్‌లో లంకతో తలపడనుంది.ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కూడా టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో సెమీఫైనల్ టికెట్ కూడా ఖాయమైంది. అయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలుపుకోవాలంటే టీం ఇండియా ఖచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలవాల్సిన అవసరం ఉంది. టీం ఇండియా తన తరువాత మ్యాచ్‌లో లంకతో తలపడుతుంది. తర్వాత దక్షిణాఫ్రికా ఇంకా నెదర్లాండ్స్ టీంలతో ఆడాల్సి ఉంది.


ఇక ఆటగాళ్ల గాయం సమస్యతో కుదేలైన శ్రీలంక టీం మొత్తం ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కానీ, సెమీ ఫైనల్ కి పోవడానికి జట్టుకు ఇంకా అవకాశం ఉంది. ఇక లంక జట్టు మిగిలిన 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, టాప్ 4లో ఉన్న ఇతర జట్లు ఓడిపోతే సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశం ఆ జట్టుకు దక్కుతుంది.అయితే శ్రీ లంక జట్టుకు పెద్ద తలనొప్పి గాయం సమస్య. టోర్నీ ప్రారంభానికి ముందు గాయం కారణంగా వనిందు హసరంగా వంటి ఆటగాడిని కోల్పోయిన లంక, టోర్నీ ప్రారంభమైన తర్వాత కెప్టెన్ దసును షనకతో సహా ముగ్గురు ఆటగాళ్లను కూడా కోల్పోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో చాలా అద్భుతంగా రాణించిన లహిరు కుమార్ గాయం కారణంగా ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. అందుకే అతని స్థానంలో దుష్మంత చమీరా ఎంపికయ్యారు. ఇలా ప్రముఖ పేసర్ లేకుండానే బరిలోకి దిగుతున్న లంక భారత్ కు ఎలాంటి సవాల్ ని విసురుతుందో వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>