PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/yellow-media-chandrababu-jail-jagan7652fb0b-f1b0-41b0-b0d7-d7cbe2d11289-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/yellow-media-chandrababu-jail-jagan7652fb0b-f1b0-41b0-b0d7-d7cbe2d11289-415x250-IndiaHerald.jpgనిందితుడైన జగన్ను ముద్దాయిగా చెప్పటంలోనే ఎల్లోమీడియా కసంతా బయటపడింది. విచారణకు కూడా జగన్ హాజరుకావటంలేదనటం పూర్తిగా అబద్ధమే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నంత కాలం జగన్ ప్రతి శుక్రవారం జైలుకు హాజరయ్యేవారు. ఈ విషయంలోనే ఎల్లోమీడియా+టీడీపీ కలిసే జగన్ను చాలా అవమానించింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణ నుండి మినహాయింపు కోసం జగన్ పెట్టుకున్న పిటీషన్ను కోర్టు అంగీకరించింది. కాబట్టి విచారణకు జగన్ హాజరుకావటంలేదు.yellow media chandrababu jail jagan{#}Jagan;High court;CBI;Anti-Corruption Bureau;Rajahmundry;court;Reddy;CBN;Friday;Industry;Telangana Chief Minister;sundayఅమరావతి : ఎల్లోమీడియా కసంతా బయటపడిందా ?అమరావతి : ఎల్లోమీడియా కసంతా బయటపడిందా ?yellow media chandrababu jail jagan{#}Jagan;High court;CBI;Anti-Corruption Bureau;Rajahmundry;court;Reddy;CBN;Friday;Industry;Telangana Chief Minister;sundayMon, 30 Oct 2023 05:00:00 GMT


జగన్మోహన్ రెడ్డి అంటే తనకు ఎంత అక్కసుందో ఎల్లోమీడియా మరోసారి బయటపెట్టుకుంది. ప్రతి ఆదివారం రాసే కొ(చె)త్తపలుకులో  జగన్ను ముద్దాయిగా ప్రకటించేసింది. ‘న్యాయం కావాలి’ పేరుతో రాసిన వ్యాసంలో అనేక అవినీతి కేసుల్లో ప్రధమ ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం విచారణకు కూడా హాజరుకాకుండా తన కేసుల నుండి మినహాయింపు ఎలా పొందగలిగారు ? అని ఎల్లోమీడియా యజమాని చాలా అమాయకంగా అడిగారు.





ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జగన్ పైన నమోదైన ఏ కేసులో కూడా ఇంతవరకు సీబీఐ సరైన సాక్ష్యాధారాలను చూపించలేకపోయింది. పైగా కేసులన్నీ విచారణ దశలోనే ఉన్నాయి కానీ  ఏ కేసులోను జగన్ కు శిక్షపడలేదు. కాబట్టి జగన్ నిందితుడేకానీ ముద్దాయి ఎంతమాత్రం కాదు. శిక్షపడితేనే ముద్దాయి అవుతారు అప్పటివరకు నిందితులే. ఇపుడు స్కిల్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటు రాజమండ్రి జైలు రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడు కూడా నిందితుడే కానీ ముద్దాయి కాదు. నిందితుడికి ముద్దాయికి ఎల్లోమీడియాకు తేడా తెలీక కాదు జగన్ను ముద్దాయిగా చెప్పింది.





నిందితుడైన జగన్ను ముద్దాయిగా చెప్పటంలోనే ఎల్లోమీడియా కసంతా బయటపడింది. విచారణకు  కూడా జగన్ హాజరుకావటంలేదనటం పూర్తిగా అబద్ధమే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నంత కాలం జగన్ ప్రతి శుక్రవారం జైలుకు హాజరయ్యేవారు. ఈ విషయంలోనే ఎల్లోమీడియా+టీడీపీ కలిసే  జగన్ను చాలా అవమానించింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణ నుండి మినహాయింపు కోసం జగన్ పెట్టుకున్న పిటీషన్ను కోర్టు అంగీకరించింది. కాబట్టి విచారణకు జగన్ హాజరుకావటంలేదు.





న్యాయ వ్యవస్ధ నిర్వీర్యమైపోయిందని, చంద్రబాబు దాఖలుచేసిన బెయిల్ పిటీషన్, క్వాష్  పిటీషన్ పై విచారణే జరగటం లేదని చెప్పటం అబద్ధం. ఏసీబీ కోర్టు, హైకోర్టులో బెయిల్ పిటీషన్లు డిస్మిస్ అయ్యాయి. క్వాష్ పిటీషన్ను హైకోర్టు ఎప్పుడో కొట్టేసింది. సుప్రింకోర్టులో మాత్రమే పెండింగులో ఉన్న విషయం ఎల్లోమీడియాకు తెలీదా ? పాములాడించేవాడు పాము కాటుకే చనిపోతాడని పెద్దలు చెబుతారు. ఒకపుడు ఏ వ్యవస్ధలను అడ్డుపెట్టుకుని జగన్ను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆటాడించాడో ఇపుడు అదే వ్యవస్ధ రివర్సయ్యేటప్పటికి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు బాధనే ఎల్లోమీడియా ప్రపంచబాధగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తోందంతే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>