HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips43949cc9-9698-409b-8b5e-b1c192b8e8ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips43949cc9-9698-409b-8b5e-b1c192b8e8ff-415x250-IndiaHerald.jpg స్పైసీ ఫుడ్స్ ని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వాటిని అధికంగా తీసుకుంటే మీరు ఖచ్చితంగా చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కారం, మసాలా ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.స్పైసీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతాయి. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు సమస్యలు ఎక్కువగా వస్తాయి. మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయడానికి స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం పరిమితం చేయడం ముఖ్యం.ఇక స్పైసీ ఫుడ్ తినడం వల్ల మానసికHealth Tips{#}Mirchi;Masala;BP;Heartస్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటే కలిగే నష్టాలు?స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటే కలిగే నష్టాలు?Health Tips{#}Mirchi;Masala;BP;HeartMon, 30 Oct 2023 23:22:00 GMT స్పైసీ ఫుడ్స్ ని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వాటిని అధికంగా తీసుకుంటే మీరు ఖచ్చితంగా చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కారం, మసాలా ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.స్పైసీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతాయి. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు సమస్యలు ఎక్కువగా వస్తాయి. మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయడానికి స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం పరిమితం చేయడం ముఖ్యం.ఇక స్పైసీ ఫుడ్ తినడం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా గట్టి ప్రభావం పడుతుంది. ఇది మరింత ఒత్తిడి, ఆందోళన ఇంకా విశ్రాంతికి ఆటంకం కలిగిస్తుంది.అందుకే మానసిక ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా స్పైసీ ఫుడ్‌ను పరిమితంగా తీసుకోవడం చాలా మంచిది. ఇక స్పైసీ ఫుడ్‌లో ఎక్కువ ఉప్పు, మసాలాలు ఉంటాయి. దీని కారణంగా బ్లడ్ ప్రెజర్ ఖచ్చితంగా పెరుగుతుంది.


మీరు ఇప్పటికే అధిక bp ఉన్న వారు అయితే మిరపకాయలు.. మసాలాలు తీసుకోవడం ఖచ్చితంగా తగ్గించండి. లేకుంటే దీర్ఘకాలంలో ఇది గుండె జబ్బులకు ఖచ్చితంగా దారితీస్తుంది.ఇంకా స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంలోని తేమ తగ్గి, పొడిబారడంతోపాటు చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి మిరపకాయలు, మసాలాలు పరిమిత పరిమాణంలో మాత్రమే తినడం ఆరోగ్యానికి మంచిది.అలాగే ఘాటైన, మసాలా ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇక దీనికి కారణం ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉండటమే.. దీన్ని తిన్న తర్వాత కూడా మీకు మరింత ఆకలిగా అనిపిస్తుంది. అందువల్ల బరువు మరింత పెరుగుతారు.ఇంకా ఎక్కువగా మిరపకాయలు, మసాలాలు తినే వారికి పైల్స్ తరచుగా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు మిర్చి ఎక్కువ వాడకం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని..కాబట్టి స్పైసి ఫుడ్ తినడం తగ్గించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>