BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsd94ed075-bd96-49cb-8574-9e1adc0b1198-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsd94ed075-bd96-49cb-8574-9e1adc0b1198-415x250-IndiaHerald.jpgడెలివరీ తరువాత చాలామంది మహిళల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టే సమస్య ఏదన్న ఉందంటే అది స్ట్రెచ్‌మార్క్స్. బరువులో హెచ్చుతగ్గులు, పని ఒత్తిడి వల్ల కూడా చర్మం సాగి స్ట్రెచ్‌మార్క్స్ అనేవి వారికి ఏర్పడుతుంటాయి.ఒక్కోసారి వీటి వల్ల మహిళలు వారికి నచ్చిన దుస్తులు కూడా ధరించలేరు. ఒకవేళ ధరించినా వారికి అసౌకర్యంగానూ అనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా వైద్యులు సూచించిన మందులు, క్రీమ్‌లతో పాటు మన ఇంట్లో కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఆ మార్క్స్‌ కనిపించకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు ఆరోగ్య నిపుణుBeauty Tipsస్ట్రెచ్‌మార్క్స్ ఈజీగా తగ్గాలంటే ఇలా చెయ్యండి?స్ట్రెచ్‌మార్క్స్ ఈజీగా తగ్గాలంటే ఇలా చెయ్యండి?Beauty TipsMon, 30 Oct 2023 22:53:53 GMTస్ట్రెచ్‌మార్క్స్ ఈజీగా తగ్గాలంటే ఇలా చెయ్యండి?

డెలివరీ తరువాత చాలామంది మహిళల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టే సమస్య ఏదన్న ఉందంటే అది స్ట్రెచ్‌మార్క్స్. బరువులో హెచ్చుతగ్గులు, పని ఒత్తిడి వల్ల కూడా చర్మం సాగి స్ట్రెచ్‌మార్క్స్ అనేవి వారికి ఏర్పడుతుంటాయి.ఒక్కోసారి వీటి వల్ల మహిళలు వారికి నచ్చిన దుస్తులు కూడా ధరించలేరు. ఒకవేళ ధరించినా వారికి అసౌకర్యంగానూ అనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా వైద్యులు సూచించిన మందులు, క్రీమ్‌లతో పాటు మన ఇంట్లో కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఆ మార్క్స్‌ కనిపించకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా అలాగే కొన్ని చిట్కాలు మార్క్స్‌ని క్రమంగా తగ్గించడంలో కూడా సహకరిస్తాయంటున్నారు.


ఒక బంగాళాదుంపని తీసుకొని దానిని కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయాలి. తరువాత ఆ ముక్కలతో స్ట్రెచ్‌మార్క్స్ ఉన్న చోట ఒక 10 నిమిషాల పాటు రుద్దాలి. కాసేపు ఆరనిచ్చి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బంగాళాదుంప రసంలో ఉండే విటమిన్లు ఇంకా ఖనిజాలు చర్మకణాల ఉత్పత్తిని పెంచి చర్మం పూర్వపు స్థితికి రావడానికి సహాయపడతాయి.దాని ఫలితంగా స్ట్రెచ్‌మార్క్స్‌ అనేవి క్రమంగా మాయమవుతాయి.ఇంకా మాయిశ్చరైజర్‌తో మేలు జరుగుతుంది.అలాగే ప్రతి రోజూ మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా ఉంటుంది. ఇక ఇలా చేయడం వల్ల బరువు పెరిగినా లేదా తగ్గినా చారలు అనేవి ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చు. ఒకవేళ ఆ స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడ్డా.. ఆ ప్రదేశంలో క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ ని రాసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.అలాగే కలబందలో ఉండే ఔషధ గుణాలు చర్మ సంబంధిత సమస్యలకూ చక్కటి పరిష్కారం చూపుతాయి. కలబంద గుజ్జుని స్ట్రెచ్‌మార్క్స్ ఉన్న చోట రాసి ఒక అరగంట పాటు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమస్య ఈజీగా తగ్గుముఖం పడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>