SportsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup62dc429c-5466-4563-9114-e05c37a1196b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup62dc429c-5466-4563-9114-e05c37a1196b-415x250-IndiaHerald.jpgకొద్దిమంది దృష్టిలో అదే కాబోయే ఛాంపియన్. ఫైనల్ కు వెళ్లడం కూడా ఖాయమనుకునే వాళ్లు చాలా మందే. టైటిల్ ఫేవరెట్ గా బరిలో ప్రపంచకప్ ను ప్రారంభించిందా జట్టు. కానీ షాక్… భారీ అంచనాలతో.. భీకర జట్టుతో భారత్ లో అడుగుపెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్. కనీసం సెమీఫైనల్ అయినా చేరకుండానే నాలుగో ఓటమితో టోర్నీ నుంచి నిష్ర్కమించే ప్రమాదంలో పడింది. సాంకేతికంగా ఇంకా మిగిలే ఉన్నాఆ జట్టు ముందంజ వేయాలంటే అద్భుతాలే జరగాలి. బంగ్లాదేశ్, అఫ్గాన్ లాంటి పసికూనలు కూడా ఇంగ్లాండ్ కంటే పాయింట్ల స్థానంలో మెరుగ్గా ఉన్నాయంటWORLD CUP{#}Champion;England;World Cup;Cricket;Hanu Raghavapudi;Indiaవరల్డ్‌కప్‌: ఇంగ్లాండ్‌ జట్టుకు ఏమైంది?వరల్డ్‌కప్‌: ఇంగ్లాండ్‌ జట్టుకు ఏమైంది?WORLD CUP{#}Champion;England;World Cup;Cricket;Hanu Raghavapudi;IndiaSat, 28 Oct 2023 23:00:00 GMTకొద్దిమంది దృష్టిలో అదే కాబోయే ఛాంపియన్. ఫైనల్ కు వెళ్లడం కూడా ఖాయమనుకునే వాళ్లు చాలా మందే. టైటిల్ ఫేవరెట్ గా బరిలో ప్రపంచకప్ ను ప్రారంభించిందా జట్టు. కానీ షాక్… భారీ అంచనాలతో..  భీకర జట్టుతో భారత్ లో అడుగుపెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్. కనీసం సెమీఫైనల్ అయినా చేరకుండానే నాలుగో ఓటమితో టోర్నీ నుంచి నిష్ర్కమించే ప్రమాదంలో పడింది. సాంకేతికంగా ఇంకా మిగిలే ఉన్నాఆ జట్టు ముందంజ వేయాలంటే అద్భుతాలే జరగాలి.


బంగ్లాదేశ్, అఫ్గాన్ లాంటి పసికూనలు కూడా ఇంగ్లాండ్ కంటే పాయింట్ల స్థానంలో మెరుగ్గా ఉన్నాయంటే ఆ జట్టు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక అంచనాలతో బరిలోకి దిగి అత్యంత పేలవ ప్రదర్శన చేసిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డులకు ఎక్కే సంకేతాలే కనిపిస్తున్నాయి.


2015 ప్రపంచకప్ ఘోర వైఫల్యంతో గ్రూప్ దశ నుంచి నిష్ర్కమించాక వన్డేల ఆట తీరునే మార్చేసి దూకుడుకు మారు పేరుగా మారిన ఇంగ్లాండ్.. పట్టుదలతో క్రికెట్ ఆడి 2019 ప్రపంచకప్ ను ముద్దాడింది.  క్రికెట్ పుట్టినిల్లు గా చెప్పుకునే ఆ దేశానికి తొలిసారి వన్డే వరల్డ్ కప్ ను అందించింది. ఈ సారి అదే ప్రదర్శన పునరావృతం అవుతుందని భావించినా చిన్న జట్టైన అఫ్గాన్ చేతిలో ఓటమి ఇంగ్లాండ్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. టోర్నీలో మొత్తం 5 మ్యాచులాడగా నాలుగింటిలో ఓడి సెమిస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.


శ్రీలంకతో ఓటమి అనంతంర ఆ జట్టు కెప్టెన్ బట్లర్ మాట్లాడుతూ మేం బాగా ఆడలేదు. ఈ ప్రశ్నకు ప్రస్తుతం జవాబు లేదు. కానీ మేం అత్యుత్తమ ప్రదర్శనకు మాత్రం ఆమడ దూరంలో ఉన్నాం అని పేర్కొన్నారు. భారత్ పరిస్థితులకు తగ్గ జట్టును ఎంపిక చేసుకోవడంలో ఆ జట్టు విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటమి తర్వాత జట్టు కూర్పును మార్చడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బ తీసిందనే చెప్పవచ్చు. ఏదీ ఏమైనా ఈ ప్రపంచకప్ ఇంగ్గాండ్ జట్టుకు పీడకలలాంటిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>