Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc77f6b68a-31ab-487e-a36e-d59eea7f509d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc77f6b68a-31ab-487e-a36e-d59eea7f509d-415x250-IndiaHerald.jpgటైటిల్ ఫేవరెట్ గా వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు అద్భుతంగా రాణిస్తుందని అందరూ అనుకున్నారు. దాయాది దేశమైన భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో పాకిస్తాన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించబోతుంది అని ఆ దేశ అభిమానులు గట్టిగా నమ్మారు. కానీ ఊహించిన రీతిలో అందరి అంచనాలను తారుమారు చేసేసింది పాకిస్తాన్ జట్టు. ఎక్కడ ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేక దారుణమైన పరాజయాలని చవిచూసింది అని చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన మ్యాచ్లో ఓటమితో ఇక పాకిస్తాన్ కు వరల్డ్ కప్ ప్రస్థానం ముగిసినట్లే అయింది. ఎందుకంటేIcc{#}Korea; South;Babur;South Africa;history;World Cup;Pakistan;Indiaపాక్ కొంపముంచిన అంపైర్స్ కాల్.. లేదంటే గెలిచేదేమో?పాక్ కొంపముంచిన అంపైర్స్ కాల్.. లేదంటే గెలిచేదేమో?Icc{#}Korea; South;Babur;South Africa;history;World Cup;Pakistan;IndiaSat, 28 Oct 2023 07:30:00 GMTటైటిల్ ఫేవరెట్ గా వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు అద్భుతంగా రాణిస్తుందని అందరూ అనుకున్నారు. దాయాది  దేశమైన భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో పాకిస్తాన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించబోతుంది అని ఆ దేశ అభిమానులు గట్టిగా నమ్మారు. కానీ ఊహించిన రీతిలో అందరి అంచనాలను తారుమారు చేసేసింది పాకిస్తాన్ జట్టు. ఎక్కడ ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేక దారుణమైన పరాజయాలని చవిచూసింది అని చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన మ్యాచ్లో ఓటమితో ఇక పాకిస్తాన్ కు వరల్డ్ కప్ ప్రస్థానం ముగిసినట్లే అయింది.


 ఎందుకంటే సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ టీం కి సెమీఫైనల్ చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ జట్టును సెమీస్లో చూడలేము అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో అటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ చేసిన కొన్ని తప్పిదాలే చివరికి జట్టు కొంప ముంచాయి. ముఖ్యంగా అంపైర్స్ కాల్ అనే నిబంధన దాయాది కొంపముంచింది అన్నది తెలుస్తుంది. అయితే బౌలర్లకు శాపంగా మారిన ఈ రూల్ ను మార్చాలని ఎన్నో రోజులుగా డిమాండ్లు కూడా వస్తున్నాయి.


 ఇక ఇప్పుడూ పాకిస్తాన్ పరాజయంతో ఈ వాదన మరింత బలంగా మారింది.  271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది సౌత్ ఆఫ్రికా. అంపైర్స్ కాల్ అనే నిబంధనలతో ఓటమి నుంచి తప్పించుకుంది.  సౌత్ ఆఫ్రికా 260 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఇక పాకిస్తాన్ విజయానికి ఒక వికెట్ అవసరం కాగా సౌతాఫ్రికాకు మరో పదకొండు పరుగులు కావాలి. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఫేసర్లు మొదటి నుంచి నిప్పులు చెరుగుతున్నారు. దీంతో పాకిస్తాన్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే హరీష్ రావుఫ్ వేసిన 46ఓవర్ చివరి బంతికి షంషీ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో పాకిస్తాన్ ఆటగాళ్లు గట్టిగా అప్పిల్ చేయగా.. ఎంపైర్ నాట్ ఔట్ ఇచ్చాడు. వెంటనే బాబర్ రివ్యూ తీసుకోగా.. రిప్లై లో ఎంపైర్స్ కాల్ గా తేలింది. బాల్ ట్రాకింగ్ లో బంతి లెగ్ స్టంప్స్ ను లైట్ గా తాకడంతో థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చిన నాటౌట్ నిర్ణయమే తుది నిర్ణయంగా మారిపోయింది. ఇలా అంపైర్స్ కాల్ కాస్త చివరికి పాకిస్తాన్ కొంపముంచింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>