BusinessPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/onionfc4fc13d-91c0-44d1-a27c-a792c189871e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/onionfc4fc13d-91c0-44d1-a27c-a792c189871e-415x250-IndiaHerald.jpgపెరుగుతున్న ఉల్లిపాయ ధరతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ధర పెరగటానికి గల కారణాలు ఏంటో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.ఉల్లి ధర మళ్ళీ ఇప్పుడు పెరగడం ఇప్పుడు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. కిలో ఉల్లి ఆగస్ట్ మొదటి వారంలో 15 నుండి 20 రూపాయల దాకా ఉండేది. తరువాత సెప్టెంబర్ నెల నాటికి ఆ ధర 35 నుండి 45 రూపాయల దాకా పెరిగింది. ఇప్పుడు ఆ ధర 60 నుండి 70 రూపాయలకు చేరింది.అయితే ఈ ధర ఇంతటితో ఆగే అవకాశాలు లేవని మరింత పెరుగుతుందని అంటున్నారు వ్యాపారులు.ఉల్లి ధర ఇలా రోజురోజుకు భారీగా పెరుగుతుండటంతonion{#}Kurnool;Maharashtra;september;Onionభారీగా పెరిగిన ఉల్లిధరలు?భారీగా పెరిగిన ఉల్లిధరలు?onion{#}Kurnool;Maharashtra;september;OnionFri, 27 Oct 2023 23:10:00 GMTపెరుగుతున్న ఉల్లిపాయ ధరతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ధర పెరగటానికి గల కారణాలు ఏంటో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.ఉల్లి ధర మళ్ళీ ఇప్పుడు పెరగడం ఇప్పుడు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. కిలో ఉల్లి ఆగస్ట్ మొదటి వారంలో 15 నుండి 20 రూపాయల దాకా ఉండేది. తరువాత సెప్టెంబర్ నెల నాటికి ఆ ధర 35 నుండి 45 రూపాయల దాకా పెరిగింది. ఇప్పుడు ఆ ధర 60 నుండి 70 రూపాయలకు చేరింది.అయితే ఈ ధర ఇంతటితో ఆగే అవకాశాలు లేవని మరింత పెరుగుతుందని అంటున్నారు వ్యాపారులు.ఉల్లి ధర ఇలా రోజురోజుకు భారీగా పెరుగుతుండటంతో కొందరు వ్యాపారులు, దళారీలు ఇదే అదునుగా తమ అక్రమ వ్యాపారాలకు పదును పెడుతున్నారు. వ్యాపారులు ఉల్లిని సేకరించి గౌడన్లలో నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారన్న ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. ఇటీవల టమోటా ధర పెరిగిన సందర్భంలో వినియోగదారులు దాదాపు టమోటా వాడకం తగ్గించడం జరిగింది. ఇంకా అలాగే ఇప్పుడు ఉల్లి వాడకం కూడా నానాటికీ తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే హోటల్స్ ఇంకా ఫాస్ట్ పుడ్ సెంటర్స్ లో ఉల్లి వాడకం తగ్గించారు.


ఇక ఉల్లి ధర పెరగడంతో కొన్ని హోటల్స్ లో ఆనియన్ దోశతో పాటు ఆనియన్స్ తో తయారుచేసే అమ్మకాలు కూడా నిలిపేశారు.అలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ఉల్లిపాయ ధరలను అదుపు చేయాలని కోరుతున్నారు వినియోగదారులు.భవిష్యత్తులో ఖచ్చితంగా మరింతగా పెరిగే అవకాశం ఉందని, వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉల్లి ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ధర పెరగడానికి గల కారణాల పై కూడా విశ్లేషిస్తున్నారు. హోల్ సేల్ వ్యాపారులు ఉల్లిపాయలను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు.ఇంకా అంతే కాకుండా గౌడన్ల పై మెరుపు దాడులకు దిగుతున్నారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ఇంకా కర్నూలు లో ఉల్లి పంట దిగుబడి తగ్గిందని, త్వరలో ఆయా చోట్ల కొత్త పంట దిగుబడి వస్తే కొంతమేర ఉల్లిపాయ ధర నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అధికారులు.ఏదేమైనా కానీ పెరిగిన ఉల్లి ధర భారం తమపై పడకుండా చూడాలని కోరుతున్నారు వినియోగదారులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>