BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-healthf279bf59-7b6c-44e0-be50-d9652de8d32d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-healthf279bf59-7b6c-44e0-be50-d9652de8d32d-415x250-IndiaHerald.jpgచాలా మందికి కూడా జుట్టు పెరుగుదల అనేది సరిగ్గా ఉండదు. అందువల్ల జుట్టు రోజురోజుకు పల్చగా మారుతుంది. ఈ క్రమంలోనే జుట్టు పెరుగుదలని పెంచుకోవడం కోసం ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అందుకు కొంతమంది మందులు కూడా వాడుతుంటారు. కానీ సహజంగా కూడా జుట్టు పెరుగుదలని మెరుగుపరిచ్చుకోవచ్చు. అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ మ్యాజికల్ సీరం అయితే చాలా అద్భుతంగా సహాయపడుతుంది. వారానికి రెండు సార్లు ఈ సీరంను వాడితే మీ జుట్టు బాగా పెరుగుతుంది.మరి ఇంతకీ ఆ సీరంను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగHAIR HEALTH{#}Onion;House;Gas Stove;oil;Manamజుట్టు పెరుగుదలని పెంచే సూపర్ టిప్?జుట్టు పెరుగుదలని పెంచే సూపర్ టిప్?HAIR HEALTH{#}Onion;House;Gas Stove;oil;ManamFri, 27 Oct 2023 21:17:00 GMTచాలా మందికి కూడా జుట్టు పెరుగుదల అనేది సరిగ్గా ఉండదు. అందువల్ల జుట్టు రోజురోజుకు పల్చగా మారుతుంది. ఈ క్రమంలోనే జుట్టు పెరుగుదలని పెంచుకోవడం కోసం ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అందుకు కొంతమంది మందులు కూడా వాడుతుంటారు. కానీ సహజంగా కూడా జుట్టు పెరుగుదలని మెరుగుపరిచ్చుకోవచ్చు. అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ మ్యాజికల్ సీరం అయితే చాలా అద్భుతంగా సహాయపడుతుంది. వారానికి రెండు సార్లు ఈ సీరంను వాడితే మీ జుట్టు బాగా పెరుగుతుంది.మరి ఇంతకీ ఆ సీరంను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు స్టవ్ ని ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ హీట్‌ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,ఒక టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ ఆకులు ఇంకా అలాగే అర కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి.


దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఆ వాటర్ జెల్లీ గా మారుతుంది. అప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో ఆ వాటర్ ను మీరు ఫిల్టర్ చేసుకోవాలి.ఇక ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆముదం ఇంకా టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.అప్పుడు మన సీరం రెడీ అవుతుంది. ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు మనం దాన్ని వాడుకోవచ్చు.రాత్రిపూట నిద్రించే ముందు ఈ సీరంను స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని పడుకోవాలి.తరువాత రోజు పొద్దున్నే మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు ఈ సీరం ను వాడితే జుట్టు చాలా అద్భుతంగా ఇంకా అలాగే వేగంగా కూడా ఎదుగుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని ట్రై చెయ్యండి. మంచి నల్లటి జుట్టుని సొంతం చేసుకోండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>