Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc039c0c22-7ccb-4486-bfcc-54b7a35c524b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc039c0c22-7ccb-4486-bfcc-54b7a35c524b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీ స్కోర్లు నమోదు అవుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లను చూసేందుకు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరిస్తూ ఉన్నారు. అయితే రసవతరమైన పోరు జరుగుతున్న నేపథ్యంలో.. సెమీఫైనల్ లో అడుగుపెట్టబోయే నాలుగు టీమ్స్ ఏవి అనే ఇప్పుడే ఒక అంచనాకు రాలేకపోతున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ చెత్త ప్Icc{#}South Africa;Pakistan;Cricket;World Cup;Indiaసౌత్ఆఫ్రికాతో మ్యాచ్ కి ముందు.. పాకిస్తాన్ కు బిగ్ షాక్?సౌత్ఆఫ్రికాతో మ్యాచ్ కి ముందు.. పాకిస్తాన్ కు బిగ్ షాక్?Icc{#}South Africa;Pakistan;Cricket;World Cup;IndiaFri, 27 Oct 2023 10:18:00 GMTప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీ స్కోర్లు నమోదు అవుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లను చూసేందుకు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరిస్తూ ఉన్నారు. అయితే రసవతరమైన పోరు జరుగుతున్న నేపథ్యంలో.. సెమీఫైనల్ లో అడుగుపెట్టబోయే నాలుగు టీమ్స్ ఏవి అనే ఇప్పుడే ఒక అంచనాకు రాలేకపోతున్నారు క్రికెట్ విశ్లేషకులు.


 ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ చెత్త ప్రదర్శనతో వరుస పరాజయాలను మూటగట్టుకుంటూ ఉన్నాయి. అదే సమయంలో ఏ టీం ఏ మ్యాచ్ లో ఓడిపోతుంది అన్నది కూడా ముందుగా ఊహించలేని విధంగానే మారిపోతుంది. ఎందుకంటే పటిష్టమైన టీమ్స్ సైతం చిన్న టీమ్స్ చేతిలో దారుణ ఓటములను చవిచూస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర  ఓటమిని చవి చూసిన పాకిస్తాన్ జట్టు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. వరల్డ్ కప్ హిస్టరీలో మొదటిసారి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాజయం పాలు అయింది అని చెప్పాలి. ఇక ఈ ఓటమితో హ్యాట్రిక్  సాధించినట్లు అయింది.


 అయితే నేడు పటిష్టమైన సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతుంది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది. కానీ ఇక సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్కి ముందే పాకిస్తాన్ కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. మోకాలి గాయంతో బాధపడుతున్న పాకిస్తాన్ జట్టు స్టార్ ఓపెనర్ పక్కర్ జమాన్ దక్షిణాఫ్రికా తో జరగబోతున్న మ్యాచ్ కి దూరం కాబోతున్నాడట. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే దీనికి కారణం అని తెలుస్తుంది. అయితే మోకాలి గాయం కారణంగా ఈ వరల్డ్ కప్ లో ఫకర్ జమాన్ కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>