EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanffa3f7a9-0a33-40cc-a000-34b6268b84b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanffa3f7a9-0a33-40cc-a000-34b6268b84b6-415x250-IndiaHerald.jpgతెలంగాణలో అత్యంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఓటు బ్యాంకు కలిగిన పార్టీలను తమ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎత్తులు వేస్తున్నాయి. తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. తాజాగా పవన్ కల్యాణ్ బీజేపీ మద్దతుతో ఎన్నికల బరిలో నిలవనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పొత్తుల విషయంలో ఇరు పార్టీలకు ఓ స్పష్టత వచPAWAN{#}Amith Shah;Amit Shah;central government;Assembly;politics;Bharatiya Janata Party;Janasena;Pawan Kalyan;Telangana;Andhra Pradesh;Minister;contractతెలంగాణలో పవన్‌ కల్యాణ్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అవుద్దా?తెలంగాణలో పవన్‌ కల్యాణ్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అవుద్దా?PAWAN{#}Amith Shah;Amit Shah;central government;Assembly;politics;Bharatiya Janata Party;Janasena;Pawan Kalyan;Telangana;Andhra Pradesh;Minister;contractFri, 27 Oct 2023 07:00:00 GMTతెలంగాణలో అత్యంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఓటు బ్యాంకు కలిగిన పార్టీలను తమ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎత్తులు వేస్తున్నాయి. తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. తాజాగా పవన్ కల్యాణ్ బీజేపీ మద్దతుతో ఎన్నికల బరిలో నిలవనున్నట్లుగా తెలుస్తోంది.


తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పొత్తుల విషయంలో ఇరు పార్టీలకు ఓ స్పష్టత వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ భేటీలో ఇద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల్లో సీట్ల పంపకాలు, పొత్తు, మద్దతుపై చర్చించేందుకు బీజేపీ ఆహ్వానం మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఒకే ఫ్లైట్ లో వెళ్లిన దిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్ సాయంత్రం అమిత్ షాను కలిశారు.


ఈ భేటీలో ముందుగా తెలంగాణ అంశం చర్చకు వచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో తమకు సహకరించాలని అమిత్ షా కోరినట్లు సమాచారం. అయితే ఏపీ అంశం ప్రస్తావనకు రాలేదన్నవార్తలు వచ్చినా ఓ సంకేతం మాత్రం ఇచ్చారని తెలుస్తోంది. ముందు తెలంగాణ ఎన్నికల్లో సహకరించండి ఆ తర్వాత ఏపీ రాజకీయాలను పరిశీలిద్దాం అని చెప్పారట. దీనికి పవన్ కూడా సరేనని చెప్పారు.


దాదాపు సమావేశం 45 నిమిషాల పాటు కొనసాగింది. ఆ తర్వాత అమిత్ షా నివాసం ఉంచి వెళ్లి పోయారు. ఏదైనా శుభవార్త అంటే పొత్తు ఓకే అయితే జనసేన నుంచి లేదా బీజేపీ నుంచి ప్రకటన వచ్చి ఉండేది.  కానీ అటువంటిది ఏమీ రాలేదు. మరోవైపు ఏపీలో పరిస్థితులు వివరించేందుకే పవన్ ఈ సమావేశానికి హాజరయ్యారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఏపీలో బీజీపీ తో కలిసి నడవాలని టీడీపీ, జనసేన పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసమైనా తెలంగాణ విషయంలో పవన్ వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>