MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bagavant-kesari-collactiones8f97be00-b6cc-4e13-9091-2f44be13f5db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bagavant-kesari-collactiones8f97be00-b6cc-4e13-9091-2f44be13f5db-415x250-IndiaHerald.jpgఆరుపదుల వయసులో కూడా కోట్లకు కోట్లు కొల్లగొడుతూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన నటించిన చిత్రం భగవంత్ కేసరి. విడుదలకు ముందే భారీ హైప్ దక్కించుకున్న ఈ సినిమా ఇటీవల భారీగా కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఇకపోతే ఈ నేపథ్యంలోనే ఆరు రోజుల్లోనే ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనే విషయం మరింత వైరల్ గా మారింది. భగవంత్ కేసరిగా బాలయ్య ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారని చెప్పవచ్చు. ఇందులోBAGAVANT KESARI;COLLACTIONES{#}Arjun Rampal;krishna;Guntur;Nellore;kajal aggarwal;sree;Darsakudu;Chitram;Indian;Vijayadashami;Dussehra;Director;Balakrishna;Telugu;Cinemaభగవంత్ కేసరి 6 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?భగవంత్ కేసరి 6 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?BAGAVANT KESARI;COLLACTIONES{#}Arjun Rampal;krishna;Guntur;Nellore;kajal aggarwal;sree;Darsakudu;Chitram;Indian;Vijayadashami;Dussehra;Director;Balakrishna;Telugu;CinemaThu, 26 Oct 2023 08:00:00 GMTఆరుపదుల వయసులో కూడా కోట్లకు కోట్లు కొల్లగొడుతూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన నటించిన చిత్రం భగవంత్ కేసరి. విడుదలకు ముందే భారీ హైప్ దక్కించుకున్న ఈ సినిమా ఇటీవల భారీగా కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఇకపోతే ఈ నేపథ్యంలోనే ఆరు రోజుల్లోనే ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనే విషయం మరింత వైరల్ గా మారింది.

భగవంత్ కేసరిగా బాలయ్య ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారని చెప్పవచ్చు.  ఇందులో శ్రీ లీల ప్రధాన పాత్ర పోషించగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్టర్ చేశారు. ఇక అర్జున్ రాంపాల్ విలన్ గా నటించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై హరీష్ పెద్ది,  సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించారు.

ఇక ఆరవ రోజు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయానికొస్తే.. నైజాంలో రూ.13.11 కోట్లు, సీడెడ్ లో రూ.10.85కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.84 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.2.42 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ .2.10 కోట్లు, కృష్ణ రూ.2.28 కోట్లు,  గుంటూరు రూ . 4.54కోట్లు , నెల్లూరు రూ.1.84 కోట్లతో కలిపి రూ.40.98 కోట్లు షేర్, రూ.68.60 కోట్లు గ్రాస్ లభించింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.3.90 కోట్లు రాబట్టగా ఓవర్సీస్ లో రూ .6 కోట్లు వసూలు చేసింది
 ఇక ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో ఈ సినిమా రూ.50.8 కోట్ల షేర్, రూ .101 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఏదేమైనా దసరా సెలవులు ఈ సినిమాకు బాగా కలిసి వచ్చాయని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>