EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrf12a7c76-f647-488f-880f-b56037d1b695-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrf12a7c76-f647-488f-880f-b56037d1b695-415x250-IndiaHerald.jpgఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ను గట్టెక్కించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఈ సారి బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యేలా ఉంది. సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద కుంగడం విపక్షాలకు ఆయుధమైంది. ఇప్పటికే దీనిపై బీజీపీ, కాంగ్రెస్ లు కాళేశ్వరంలో అవినీతి జరిగింది.. కేసీఆర్ కు ఏటీఎం లా మారింది అని ఆరోపణలు చేస్తున్నాయి. దీనికి ఊతమిచ్చేలా మేడిగడ్డ కుంగడం తో ఏమీ చెయ్యాలో పాలుపోని స్థితిలో గులాబీ బాస్ ఉన్నారు. అయితే ఈ విషయాన్నKCR{#}KCR;Anil Jain;kaleshwaram;Traffic police;Kaleswaram Project;Congress;CM;ravi anchorమేడిగడ్డ.. కేసీఆర్‌ తలరాత మార్చేస్తుందా?మేడిగడ్డ.. కేసీఆర్‌ తలరాత మార్చేస్తుందా?KCR{#}KCR;Anil Jain;kaleshwaram;Traffic police;Kaleswaram Project;Congress;CM;ravi anchorThu, 26 Oct 2023 06:30:00 GMTఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ను గట్టెక్కించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఈ సారి బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యేలా ఉంది.  సీఎం కేసీఆర్ గొప్పగా  చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు  మేడిగడ్డ వద్ద కుంగడం విపక్షాలకు ఆయుధమైంది.  ఇప్పటికే దీనిపై బీజీపీ, కాంగ్రెస్ లు కాళేశ్వరంలో అవినీతి జరిగింది.. కేసీఆర్ కు ఏటీఎం లా మారింది అని ఆరోపణలు చేస్తున్నాయి.  దీనికి ఊతమిచ్చేలా మేడిగడ్డ కుంగడం తో ఏమీ చెయ్యాలో పాలుపోని స్థితిలో గులాబీ బాస్ ఉన్నారు.


అయితే ఈ విషయాన్ని మీడియాలో రాకుండా జాగ్రత్త పడిన కేసీఆర్ సోషల్ మీడియాలో మాత్రం అడ్డుకోలేకపోయారు.  ఇవాళ దీనిపై కుట్ర కోణం ఉందంటూ ఇంజినీరింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.  దీనిపై ఇప్పటికే భూపాల పల్లి ఎస్పీ మావోల చర్య కాదని తేల్చి చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఫిర్యాదు చేయడం.. దీనిలో కుట్ర కోణం ఉందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.  ఇది ఇప్పుడు మీడియాలో ప్రధాన వార్తాంశం అయింది.


అయితే నాణ్యతా లోపం కారణంగానే బ్యారేజీ కుంగిపోయిందని రిటైర్డ్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై కేంద్రం దాని పరిధిలోని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు నిపుణుల బృందాన్ని తనిఖీ కోసం పంపింది. క్షేత్ర స్థాయిలో ఈ బృందం పరిశీలన చేసింది.  కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.


ఘటన జరిగిన 24 గంటల తర్వాత మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రవి కాంత్ ఫిర్యాదు చేశారు. భారీ శబ్దం వచ్చిన తర్వాత వెళ్లి చూస్తే 21 నంబరు పిల్లరు కుంగిపోయినట్లు తేలిందని ఏఈఈ పేర్కొన్నారు. ప్రభుత్వమే ఒత్తిడి చేసి ఈ ఫిర్యాదు చేయించింది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో చిక్కులు వస్తాయనే ఇలా చేసింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>