PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telagnana-kishanreddy-pawan-bjp-janasena044ee7a7-24d3-4d30-b0d5-288420da63f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telagnana-kishanreddy-pawan-bjp-janasena044ee7a7-24d3-4d30-b0d5-288420da63f9-415x250-IndiaHerald.jpgపొత్తు చర్చలను ఫైనల్ చేసుకోవటానికి కిషన్, పవన్, నాదెండ్ల మనోహర్ కలిసి ఢిల్లీకి వెళ్ళారు. పొత్తులో జనసేన 12 సీట్లలో పోటీచేస్తుందని పవన్ ప్రతిపాదిస్తే 6 లేదా 8 సీట్లు ఇవ్వటానికి బీజేపీ అంగీకరించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సరే మహాయితే ఈ సంఖ్య పదికి పెరిగితే పెరగవచ్చు. ఎందుకంటే బీజేపీకి కూడా 119 నియోజకవర్గాల్లో పోటీచేయాలంటే బలమైన అభ్యర్ధులు లేరు కాబట్టే. ఈ లెక్కల ఎన్నిసీట్లలో భారం తగ్గినా తగ్గినట్లే అనుకున్నట్లున్నారు కమలనాదులు.telagnana kishanreddy pawan bjp janasena{#}Nadendla Manohar;Janasena;Pawan Kalyan;Andhra Pradesh;Bharatiya Janata Party;Party;Successహైదరాబాద్ : పవన్ స్ధాయి ఇంతగా పడిపోయిందా ?హైదరాబాద్ : పవన్ స్ధాయి ఇంతగా పడిపోయిందా ?telagnana kishanreddy pawan bjp janasena{#}Nadendla Manohar;Janasena;Pawan Kalyan;Andhra Pradesh;Bharatiya Janata Party;Party;SuccessThu, 26 Oct 2023 03:00:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ధాయి తెలంగాణాలో బాగా పడిపోయినట్లే ఉంది. అంటే ఒకపుడు బ్రహ్మాండంగా ఏమీలేదు. కాకపోతే తెలంగాణాలో జనసేన బలంగా ఉందని పవనే పదేపదే ఒకపుడు చెప్పుకున్నారు. అలాంటిది తన స్ధాయిని తానే దిగజార్చేసుకున్నారు. తాజాగా జరిగిన డెవలప్మెంట్లను చూస్తే ఈ విషయం అందరికీ అర్ధమైపోతుంది. రాబోయే తెలంగాణా ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. పొత్తు విషయమై ఈమధ్యనే తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పవన్ భేటీ అయిన విషయం తెలిసిందే.





పొత్తు చర్చలను ఫైనల్ చేసుకోవటానికి కిషన్, పవన్, నాదెండ్ల మనోహర్ కలిసి ఢిల్లీకి వెళ్ళారు. పొత్తులో జనసేన 12 సీట్లలో పోటీచేస్తుందని పవన్ ప్రతిపాదిస్తే 6 లేదా 8 సీట్లు ఇవ్వటానికి బీజేపీ అంగీకరించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సరే మహాయితే ఈ సంఖ్య పదికి పెరిగితే పెరగవచ్చు. ఎందుకంటే బీజేపీకి కూడా 119 నియోజకవర్గాల్లో పోటీచేయాలంటే బలమైన అభ్యర్ధులు లేరు కాబట్టే. ఈ లెక్కల ఎన్నిసీట్లలో భారం తగ్గినా తగ్గినట్లే అనుకున్నట్లున్నారు కమలనాదులు.





బీజేపీ పాయింటులో ఈ లెక్క కరెక్టే కానీ జనసేన కోణంలోనే పవన్ తన స్ధాయిని తానే దిగజార్చుకున్నట్లయ్యింది. ఎలాగంటే ఈమధ్యనే తెలంగాణా ఎన్నికల్లో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని పవనే ప్రకటించారు. ప్రకటనతో ఊరుకోకుండా నియోజకవర్గాలను కూడా ప్రకటించారు. అప్పుడు 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని ప్రకటించి ఇపుడు ఎనిమిది లేదా పది సీట్లకు పరిమితమైతే పార్టీ స్ధాయి దిగజారిపోయినట్లే కదా ?





దీని ప్రభావం తప్పకుండా రాబోయే ఏపీ ఎన్నికల్లో కూడా పడుతుందన్నది వాస్తవం. పోటీచేసే విషయంలో పవన్ అనుకున్నట్లు కాకుండా తాను అనుకున్నట్లే పవన్ను పరిమితంచేయటంలోనే కిషన్ మొదటి సక్సెస్ సాధించారు. ఇక నియోజకవర్గాలు ఏవి అన్నదే సస్పెన్సుగా మారింది. ఈ విషయంలో కూడా బీజేపీ ఇచ్చిన నియోజకవర్గాలు తీసుకోవటం మినహా పవన్ కు వేరే దారిలేదన్న విషయం అందరికీ తెలిసిందే.  మరి ఢిల్లీలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>