SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup-202317075d88-2f51-4e6d-9d02-d3614a842205-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup-202317075d88-2f51-4e6d-9d02-d3614a842205-415x250-IndiaHerald.jpgఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ ఫేవరెట్‌ జట్లలో ఒకటైన ఇంగ్లండ్‌ ఆటతీరు అసలు ఏ మాత్రం మారడం లేదు.డిపెండింగ్‌ ఛాంపియన్‌ గా బరిలోకి దిగన ఆ జట్టు ఇప్పుడు ఏకంగా వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచే నిష్ర్కమించే స్థితికి చేరుకుంది.ఇప్పటికే ఆఫ్గనిస్తాన్‌ టీం చేతిలో దారుణంగా ఓడిపోయిన ఆ జట్టు ఇప్పుడు శ్రీలంక చేతిలో కూడా చిత్తయ్యేలా ఓడిపోయింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్‌ టీమ్‌ కేవలం 33. 2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. అసలు బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో ఒక్కWorld Cup 2023{#}johnny;rajitha;Johnny;Chris Morris;Sri Lanka;English;ali;England;World Cupవరల్డ్ కప్ నుంచి ఇంగ్లాండ్ ఔట్?వరల్డ్ కప్ నుంచి ఇంగ్లాండ్ ఔట్?World Cup 2023{#}johnny;rajitha;Johnny;Chris Morris;Sri Lanka;English;ali;England;World CupThu, 26 Oct 2023 20:37:00 GMTఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ ఫేవరెట్‌ జట్లలో ఒకటైన ఇంగ్లండ్‌ ఆటతీరు అసలు ఏ మాత్రం మారడం లేదు.డిపెండింగ్‌ ఛాంపియన్‌ గా బరిలోకి దిగన ఆ జట్టు ఇప్పుడు ఏకంగా వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచే నిష్ర్కమించే స్థితికి చేరుకుంది.ఇప్పటికే ఆఫ్గనిస్తాన్‌ టీం చేతిలో దారుణంగా ఓడిపోయిన ఆ జట్టు ఇప్పుడు శ్రీలంక చేతిలో కూడా చిత్తయ్యేలా ఓడిపోయింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్‌ టీమ్‌ కేవలం 33. 2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. అసలు బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో ఒక్కరంటే ఒక్క ఇంగ్లండ్‌ బ్యాటర్‌ అర్ధ సెంచరీ కూడా చేయలేపోయారు. బెన్‌స్టోక్స్‌ (43; 73 బంతుల్లో 6 ఫోర్లు) మాత్రమే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానీ బెయిర్‌స్టో (30; 31 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మలన్ (28; 25 బంతుల్లో 6 ఫోర్లు) మాత్రమే రాణించారు. ట్‌ (3), జోస్‌ బట్లర్‌ ( 8), లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ (1), మొయిన్‌ అలీ (15), క్రిస్‌ వోక్స్‌ (0), ఆదిల్ రషీద్‌ (2), మార్క్‌ వుడ్ (5) ఇంకా డేవిడ్ విల్లీ (14 నాటౌట్‌ ) అలా వచ్చి ఇలా వెళ్లారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార 3 వికెట్లు తీసుకోగా, ఏంజెలో మాథ్యూస్‌, రజిత తలా రెండు వికెట్లు, మహీశ్‌ తీక్షణ ఒక వికెట్ ని పడగొట్టారు.


ఇక ఈ కీలక మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్, శ్రీలంక జట్లు రెండు ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు చేశాయి. ఇంగ్లండ్‌ గస్ అటిన్సన్, హ్యారీ బ్రూక్ ఇంకా గాయపడిన రీస్ టాప్లీలకు విశ్రాంతి నిచ్చింది . ప్లేయింగ్ ఎలెవన్‌లో ఈ ముగ్గురికి బదులుగా లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ ఇంకా క్రిస్ వోక్స్‌లకు అవకాశం కల్పించారు. శ్రీలంక జట్టులో ఏంజెలో మాథ్యూస్ అలాగే లహిరు కుమారకు అవకాశం కల్పించారు. ఇక మ్యాచ్లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ టీం మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. పవర్‌ ప్లే దాకా 44/0 స్కోరుతో పటిష్టమైన స్థితిలోనే ఉంది. అయితే చాలా రోజుల తర్వాత జట్టులోకి అడుగుపెట్టిన ఏంజెలో మాథ్యూస్‌ ఇంగ్లండ్‌ ను దారుణంగా మొదటి దెబ్బ తీశాడు. ఇక ఆ తర్వాత లహిరు కుమార, రజిత విజృంభించడంతో వరుస విరామాల్లో వికెట్లో కోల్పోయింది. అయితే కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ మాత్రమే కాసేపు లంకేయులను ఎదుర్కొన్నాడు. ఇక ప్రపంచకప్‌లో ఇప్పటి దాకా ఇంగ్లండ్‌, శ్రీలంక జట్లు 11 సార్లు తలపడ్డాయి. ఇంగ్లండ్‌ 6 మ్యాచ్‌లు ఇంకా శ్రీలంక 5 మ్యాచ్‌లు గెలిచాయి. మరి ఈ మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు దాదాపు ప్రపంచ కప్‌ టోర్నీ నుంచి నిష్ర్కమించడం ఖాయం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>