PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-pawan-janasena-tdpe0680dce-f17c-46e7-81ae-c990e177c594-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-pawan-janasena-tdpe0680dce-f17c-46e7-81ae-c990e177c594-415x250-IndiaHerald.jpgచంద్రబాబు ఉంటే అసలీ సమస్య ఉత్పన్నమయ్యేదికాదు. అలాంటిది ఇపుడు సీట్ల సంఖ్యతో పాటు నియోజకవర్గాలను డిసైడ్ చేసేంత సీన్ లోకేష్ కు లేదు. అలాగని యనమల, అచ్చెన్నాయుడు లాంటి నేతలు చొరవ తీసుకుంటే లోకేష్ అంగీకరించరు. పోనీ వీలైనన్ని సీట్లను పవన్ తీసుకుంటారా అంటే అదీ అనుమానమే. ఎందుకంటే జనసేనకు గట్టి అభ్యర్ధులే లేరు. జనసేనకు ఎన్ని ఎక్కువ సీట్లిస్తే అదంతా టీడీపీకి మైనస్సే. ఈ పరిస్ధితిల్లో పొత్తులు, సీట్లు, ఎన్నికల వ్యయం, నిధుల సర్దుబాటు తదితరాలన్నీ పెద్ద సమస్యగా మారబోతోంది. lokesh pawan janasena tdp{#}ATCHANNAIDU KINJARAPU;Rajahmundry;Janasena;Pawan Kalyan;TDP;CBN;Elections;February;Telangana Chief Minister;CM;Party;Lokesh;Lokesh Kanagaraj;Industryఅమరావతి : ఇంతకన్నా అవమానం ఉంటుందా ?అమరావతి : ఇంతకన్నా అవమానం ఉంటుందా ?lokesh pawan janasena tdp{#}ATCHANNAIDU KINJARAPU;Rajahmundry;Janasena;Pawan Kalyan;TDP;CBN;Elections;February;Telangana Chief Minister;CM;Party;Lokesh;Lokesh Kanagaraj;IndustryThu, 26 Oct 2023 07:00:00 GMT


ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు తెలుగుదేశంపార్టీకి ఇంతకు మించిన అవమానం ఇంకేముంటుంది ? రాబోయే ఎన్నికల్లో కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో కూడా ప్రకటించేస్ధితిలో టీడీపీ లేదు. స్కిల్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి గడచిన 47 రోజులుగా చంద్రబాబు జైలులో ఉన్న విషయం తెలిసిందే. జైలులో ఉన్న కారణంగా చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే స్ధితిలో పార్టీ లేదు. పోనీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారా అంటే అదీ లేదు.





పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఈ విషయం స్పష్టంగా రెండుపార్టీల సమన్వయ కమిటి సమావేశం తర్వాత బయటపడింది. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరంటే లోకేష్ సమాధానం చెప్పలేకపోయారు. అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా నోటికొచ్చిందేదో చెప్పి తప్పించుకున్నారు. మామూలుగా అయితే టీడీపీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్ధి ఎవరనే ప్రశ్నే తలెత్తదు.





కానీ ఇప్పటి పరిస్ధితి ప్రత్యేకమని వేరే చెప్పక్కర్లేదు. ఎన్నికలు తరుముకొస్తున్న నేపధ్యంలో చంద్రబాబు జైలులో ఉండటం టీడీపీకి కోలుకోలేని పెద్ద దెబ్బ. ఇదే పరిస్ధితి ఫిబ్రవరి వరకు కంటిన్యు అయితే కూటమి గెలుపుపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే పొత్తు చర్చల్లో సీట్ల సర్దుబాటు చాలా కీలకం. సీట్ల సర్దుబాటంటే పోటీచేయబోయే నియోజకవర్గాల సంఖ్య+పోటీచేయబోయే నియోజకవర్గాలు.





చంద్రబాబు ఉంటే అసలీ సమస్య ఉత్పన్నమయ్యేదికాదు. అలాంటిది ఇపుడు సీట్ల సంఖ్యతో పాటు నియోజకవర్గాలను డిసైడ్ చేసేంత సీన్ లోకేష్ కు లేదు. అలాగని యనమల, అచ్చెన్నాయుడు లాంటి నేతలు చొరవ తీసుకుంటే లోకేష్ అంగీకరించరు. పోనీ వీలైనన్ని సీట్లను పవన్ తీసుకుంటారా అంటే అదీ అనుమానమే. ఎందుకంటే జనసేనకు గట్టి అభ్యర్ధులే లేరు. జనసేనకు ఎన్ని ఎక్కువ సీట్లిస్తే అదంతా టీడీపీకి మైనస్సే. ఈ పరిస్ధితిల్లో పొత్తులు, సీట్లు, ఎన్నికల వ్యయం, నిధుల సర్దుబాటు తదితరాలన్నీ పెద్ద సమస్యగా మారబోతోంది.





ఒకవేళ ఎన్నికలకు ముందు చంద్రబాబు జైలునుండి బెయిల్ పై రిలీజయినా అప్పుడు చేయగలిగేది కూడా ఏమీ ఉండదు. మొత్తానికి తాను ముఖ్యమంత్రి అభ్యర్ధినే అని ప్రకటించుకునే స్ధితిలో కూడా లోకేష్ లేరు. ఇంతకు మించిన అవమానం పార్టీకి ఇంకేముంటుంది ? అన్న పాయింట్ మీదే జనాల్లో చర్చ జరుగుతోంది. 




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>