LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/carrot63df047e-8098-4177-8df8-da4b694a6745-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/carrot63df047e-8098-4177-8df8-da4b694a6745-415x250-IndiaHerald.jpgక్యారెట్ లో చాలా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్స్ లో ఉండే పోషకాల గురించి అలాగే వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.ఒక 100 గ్రాముల క్యారెట్ లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది.ఇంకా అలాగే 69 మైక్రో గ్రాముల సోడియం, 320 మైక్రో గ్రాముల పొటాషియం, 9 శాతం విటమిన్ సి, 5 శాతం విటమిన్ బి6, 3 శాతం మెగ్నీషియం, 2.8 గ్రాముల ఫైబర్ ఇంకా 3 శాతం క్యాల్షియం ఉంటాయి.క్యారెట్ లో బీటా కెరోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది.ఈ బీటా కెరోటీన్ అనేది కాలేయంలోCarrot{#}Vitamin;Cancer;Calcium;Heart;Shakti;Manamక్యారెట్ ఇలా తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు?క్యారెట్ ఇలా తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు?Carrot{#}Vitamin;Cancer;Calcium;Heart;Shakti;ManamThu, 26 Oct 2023 15:35:00 GMTక్యారెట్ లో చాలా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్స్ లో ఉండే పోషకాల గురించి అలాగే వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.ఒక 100 గ్రాముల క్యారెట్ లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది.ఇంకా అలాగే 69 మైక్రో గ్రాముల సోడియం, 320 మైక్రో గ్రాముల పొటాషియం, 9 శాతం విటమిన్ సి, 5 శాతం విటమిన్ బి6, 3 శాతం మెగ్నీషియం, 2.8 గ్రాముల ఫైబర్ ఇంకా 3 శాతం క్యాల్షియం ఉంటాయి.క్యారెట్ లో బీటా కెరోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది.ఈ బీటా కెరోటీన్ అనేది కాలేయంలోకి వెళ్లిన తరువాత విటమిన్ ఎ మారుతుంది. ఈ బీటాకెరోటీన్ మంచి యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పని చేస్తుంది. క్యారెట్ లను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే బీటా కెరోటీన్ శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను ఈజీగా నశింపజేసి శరీరం అనారోగ్యసమస్యల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడుతుంది. ఇంకా అలాగే క్యారెట్ లను తీసుకోవడం వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది.అలాగే మాక్యులర్ డిజెనరేషన్ వంటి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.


క్యారెట్ లను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటాము. క్యారెట్ లను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఇంకా మలబద్దకం సమస్య లేకుండా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా క్యారెట్ లను తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రక్తపోటు అదుపులో ఉంటుంది.రక్తంలో చక్కె స్థాయిలు కూడా ఈజీగా అదుపులో ఉంటాయి. క్యారెట్ లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా క్యారెట్స్ మనకు చాలా సహాయపడతాయి. ఈ విధంగా క్యారెట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది కూడా క్యారెట్ లను జ్యూస్ రూపంలో వడకట్టి తీసుకుంటూ ఉంటారు. అయితే క్యారెట్ లను వీలైనంత వరకు నమిలి తినాలని అప్పుడే మన ఆరోగ్యానికి మేలు కలిగి ఈ ప్రయోజనాలన్నింటిని మనం పొదగలుగుతామని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>