PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-bhuvaneswari-lokesh297c66ec-1448-4859-b3de-9e3e280ecac9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-bhuvaneswari-lokesh297c66ec-1448-4859-b3de-9e3e280ecac9-415x250-IndiaHerald.jpgఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే భువనేశ్వరి వాదనే చాలా తప్పు. ఎలాగంటే స్కిల్ స్కామ్ లో ప్రధాన పాత్రదారుడిగా చంద్రబాబును సీఐడీ అరెస్టుచేసింది. అరెస్టుచేయటం వరకే సీఐడీ పాత్ర. రిమాండు విధించటం, బెయిల్ రెజెక్టుచేయటం అంతా కోర్టుచేసిందే. అంటే ఇపుడు చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారంటే అందుకు కారణం సీఐడీ కాదు కోర్టు మాత్రమే. చంద్రబాబును సీఐడీ అరెస్టుచేయటం తప్పని కోర్టు అనుకుంటే ఎప్పుడో బెయిల్ వచ్చేసేదే అనటంలో సందేహంలేదు.chandrababu Bhuvaneswari lokesh{#}bhuvaneshwari;Success;Chandragiri;Yatra;Rajahmundry;Nara Bhuvaneshwari;CBN;courtరాయలసీమ : పాపం భువనేశ్వరిరాయలసీమ : పాపం భువనేశ్వరిchandrababu Bhuvaneswari lokesh{#}bhuvaneshwari;Success;Chandragiri;Yatra;Rajahmundry;Nara Bhuvaneshwari;CBN;courtWed, 25 Oct 2023 03:00:00 GMT


నిజం గెలవాలి అనే నినాదంతో నారా భువనేశ్వరి ఈనెల 25వ తేదీనుండి పెద్దఎత్తున యాత్ర మొదలుపెడుతున్నారు. కారణం ఏమిటంటే చంద్రబాబునాయుడును సీఐడీ అక్రమంగా అరెస్టుచేసిందట. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టారన్నది భువనేశ్వరి వాదన. అందుకని నిజంగెలవాలనే నినాదంతో బస్సుయాత్ర మొదలుపెట్టబోతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లి నుండి యాత్రను మొదలుపెడుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులను ఓదర్చటమే యాత్ర ప్రధాన ఉద్దేశ్యం.





ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే భువనేశ్వరి వాదనే చాలా తప్పు. ఎలాగంటే స్కిల్ స్కామ్ లో ప్రధాన పాత్రదారుడిగా చంద్రబాబును సీఐడీ అరెస్టుచేసింది. అరెస్టుచేయటం వరకే సీఐడీ పాత్ర. రిమాండు విధించటం, బెయిల్ రెజెక్టుచేయటం అంతా కోర్టుచేసిందే. అంటే ఇపుడు చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారంటే అందుకు కారణం సీఐడీ కాదు కోర్టు మాత్రమే. చంద్రబాబును సీఐడీ అరెస్టుచేయటం తప్పని కోర్టు అనుకుంటే ఎప్పుడో బెయిల్ వచ్చేసేదే అనటంలో సందేహంలేదు.





స్కామ్ కు పాల్పడ్డారనటంలో ప్రాథమిక సాక్ష్యాలున్నాయని నమ్మిన తర్వాతే కోర్టు చంద్రబాబు బెయిల్ దరఖాస్తులను తిరస్కరిస్తోందని అందరికీ తెలుసు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని మామూలు జనాలు కూడా అనుకుంటున్నారు. అవినీతికి పాల్పడి అరెస్టయి రిమాండులో ఉన్నారు కాబట్టే చంద్రబాబు పై జనాల్లో సానుభూతి రావటంలేదు. ఈ విషయాన్ని భువనేశ్వరి మరచిపోయినట్లున్నారు.  ఎంతసేపు చంద్రబాబు అరెస్టు అక్రమం అని అంటున్నారే కానీ ఎలా అక్రమమో మాత్రం చెప్పటంలేదు. ఆధారాలు లేకుండానే చంద్రబాబును సీఐడీ అరెస్టుచేసిందని భువనేశ్వరి నానా రచ్చచేస్తున్నారు.





ఇదే సమయంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ చూపిస్తున్న ఆధారాలను భువనేశ్వరి కాదనటంలేదు. ఎంతసేపు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవంటున్నారే కానీ అవినీతికి పాల్పడలేదని కానీ లేదా సీఐడీ చూపించిన ఆధారాలు తప్పని కానీ భువనేశ్వరి చెప్పటంలేదు. ఇక్కడే భువనేశ్వరి యాత్ర సక్సెస్ పై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రజాసమస్యల మీద పోరాటాలు చేసి అరెస్టయితే జనాల్లో సానుభూతి ఉంటుందేమో కానీ అవినీతికి పాల్పడి అరెస్టయితే జనాలు పట్టించుకోరన్న చిన్న లాజిక్కును భువనేశ్వరి మరచిపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>