EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawand82bd640-b8cb-44ae-b57e-df7c4b8f7022-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawand82bd640-b8cb-44ae-b57e-df7c4b8f7022-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఎన్నికల వేడి ఏపీ ని అంటుకుంది. తెలంగాణలో పోటీ చేయాలని అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై పార్టీలో సమాలోచనలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ, జనసేన పార్టీలు కలసి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ కార్యచరణను సిద్ధం చేశాయి. ఈ సమావేశానికి ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..రాజకీయాల్లPAWAN{#}Janasena;Kanna Lakshminarayana;Pawan Kalyan;Jagan;Andhra Pradesh;TDP;Party;Hanu Raghavapudi;CBN;YCPపవన్.. ఆ విషయంలో ప్రజలను నమ్మించగలరా?పవన్.. ఆ విషయంలో ప్రజలను నమ్మించగలరా?PAWAN{#}Janasena;Kanna Lakshminarayana;Pawan Kalyan;Jagan;Andhra Pradesh;TDP;Party;Hanu Raghavapudi;CBN;YCPWed, 25 Oct 2023 23:00:00 GMTతెలంగాణ ఎన్నికల వేడి ఏపీ ని అంటుకుంది. తెలంగాణలో పోటీ చేయాలని అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై పార్టీలో సమాలోచనలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ, జనసేన పార్టీలు కలసి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ కార్యచరణను సిద్ధం చేశాయి. ఈ సమావేశానికి ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై పలు సూచనలు చేశారు.


ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రలు ఎవరూ ఉండరు. కమ్యూనిస్టులతో కలిసినా.. బీజేపీతో కలిసినా.. టీడీపీతో పొత్తులు పెట్టుకున్నా అది ప్రజలకు మేలు చేసేందుకే. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. నేను ఎవరికీ, ఏపార్టీకి వ్యతిరేకం కాదు. పార్టీ ప్రతినిధులు పార్టీ కోసమే మాట్లాడాలి అని ఆ పార్టీ సమావేంలో తెలిపారు.


అయితే పార్టీ అధికార ప్రతినిధుల కన్నా ముందు పవన్ కల్యాణ్ ప్రజలను కన్విన్స్ చేయాలి. ఎందుకంటే 2014-19 లో టీడీపీ పాలన బాగుంటే ఆ పార్టీకి 23 స్థానాలే ఎందుకు వచ్చాయి. ఒకవేళ జగన్ పాలన సరిగ్గా చేయకపోతే ఆయన్ను ఇలానే ఓడిస్తారు కదా. టీడీపీ పాలన బాగుంది అని చెప్పాలా వైసీపీ పనితీరు బాగా లేదని ప్రచారం చేయాలా.. అవినీతి ని సహించను. అవినీతి పరుడు కాబట్టే జగన్ ను వ్యతిరేకిస్తున్నానని పవన్‌ చెప్పగలరా అన్నది ఆలోచించాలి.


అదే నిజమైతే ఇప్పుడు చంద్రబాబు అవినీతి కేసులోనే అరెస్టయ్యారు. ఇప్పుడు చంద్రబాబుకి ఎలా మద్దతిస్తారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలను వ్యతిరేకించాలి. 2019  సమయంలో చంద్రబాబు పై నేను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పి పవన్ వారందరనీ కన్విన్స్  చేయాలి. పార్టీ  అధికార ప్రతినిధులు వీటిని కన్విన్స్ చేయలేరు. ప్రజలు వారిని చూసి ఓటు వేయరు. పార్టీ అధినేతను మాత్రమే చూస్తారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>