PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8015c86c-7140-455b-9df9-0d3c10a5f995-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8015c86c-7140-455b-9df9-0d3c10a5f995-415x250-IndiaHerald.jpgఅసెంబ్లీ ఎన్నికల వేళ ఓట్లను కొల్లగొట్టేందుకు, మూడో సారి సీఎం అయ్యేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో షెడ్యూల్ కన్నా రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. విపక్షాల కంటే ముందే ప్రచారం లో దూసుకుపోతున్నారు. అయితే ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం పెను సంచలనంగా మారింది. సాధారణంగా ఇది మీడియాలో బ్యానర్ ఐటెం. కేసీఆర్ తన గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం సాధారణ విషయమేమీ కాదు. కానీ సీఎం కేసీఆర్ మీడియాలో ప్రచారం కాకుంkcr{#}KCR;Telangana;Kanna Lakshminarayana;Kaleswaram Project;CM;media;policeమేడిగడ్డ.. కేసీఆర్ చారిత్రక తప్పిదం చేసేశారా?మేడిగడ్డ.. కేసీఆర్ చారిత్రక తప్పిదం చేసేశారా?kcr{#}KCR;Telangana;Kanna Lakshminarayana;Kaleswaram Project;CM;media;policeWed, 25 Oct 2023 23:38:00 GMTఅసెంబ్లీ ఎన్నికల వేళ ఓట్లను కొల్లగొట్టేందుకు, మూడో సారి సీఎం అయ్యేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో షెడ్యూల్ కన్నా రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించారు.  ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. విపక్షాల కంటే ముందే ప్రచారం లో దూసుకుపోతున్నారు.  అయితే ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం పెను సంచలనంగా మారింది.


సాధారణంగా ఇది మీడియాలో బ్యానర్ ఐటెం. కేసీఆర్ తన గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం సాధారణ విషయమేమీ కాదు.  కానీ సీఎం కేసీఆర్ మీడియాలో ప్రచారం కాకుండా దీనిని ఆపగలిగారు. అయితే సోషల్ మీడియా ప్రభావం, విపక్షాల రంగప్రవేశం తో ఈ విషయాన్ని దాచేందుకు యత్నించిన కేసీఆర్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇదే సమయంలో గులాబీ బాస్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు.


కుంగిన విషయాన్ని దాచే ప్రయత్నం  ఒకటి కాగా రెండోది కుంగడంలో కుట్ర కోణ ఉందని… ఆ విషయాన్ని ఇంజినీరింగ్ అధికారులతో ప్రచారం చేయించడం రెండోది. బ్యారెజీ కుంగడంపై మావోయిస్టుల చర్యలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు రాజకీయ కుట్ర ఉందన్న వాదనను జనంలోకి తీసుకెళ్లేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయించారనే వాదన వినిపిస్తోంది.


కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను తన ఖాతాలో వేసుకున్న సీఎం కేసీఆర్ వైఫల్యాలను మాత్రం విపక్షాల మీదకి నెట్టేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి పాలన మొత్తం ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్లిపోయింది. విచారణకు ఆదేశిస్తే ఎన్నికల సంఘం ఆదేశించాలి. కానీ ఎవరూ చెప్పకుండానే ఇంజినీరింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందంటున్నారు. ఈ అంశంపై కేసీఆర్ సైతం నోరు మెదపడం లేదు. కుంభకోణాన్ని కుట్ర కోణంగా మార్చే ప్రయత్నాలు తెరవెనుక జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇతర పనులకు నిధులు ఆపి మరీ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగేళ్లకే ఇలాంటి పరిస్థితి రావడం తెలంగాణ ప్రజలు హర్షించరు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>