HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/lips-beautya8e98d08-83c8-46e0-bec3-999ad97f17a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/lips-beautya8e98d08-83c8-46e0-bec3-999ad97f17a5-415x250-IndiaHerald.jpgమిగతా కాలాల్లో ఎలా ఉన్నా చలికాలం మొదలైంది అంటే చాలు చర్మం పగుళ్ళు,పెదాల పగుళ్లు మొదలవుతూ ఉంటాయి.ఇలా పెదాలు పగలడం వల్ల నొప్పిగాను మరియు అందవిహీనంగానూ కనిపిస్తూ ఉంటాయి.ఇంకా చెప్పాలంటే కొంతమందికి పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతు ఉండి,మరింత నొప్పిగా ఉంటుంది.అలా కాకుండా పెదాలు ఎర్రగా,దొండ పండులాగా ఉండాలి అంటే కొన్ని రకాల పద్ధతులను కచ్చితంగా పాటించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.అసలు మన పెదాలని ఈ చలికాలం నుంచి ఎలా కాపాడుకోవాలో మనము తెలుసుకుందాం పదండి.. చలికాలంలో అతిగా చల్లగా ఉండడం వల్ల మనLIPS;BEAUTY{#}Vitaminచలికాలంలో పెదాలు మృదువుగా ఉంచుకోవాలంటే ఇలా చేసి చుడండి..!చలికాలంలో పెదాలు మృదువుగా ఉంచుకోవాలంటే ఇలా చేసి చుడండి..!LIPS;BEAUTY{#}VitaminWed, 25 Oct 2023 06:00:00 GMTమిగతా కాలాల్లో ఎలా ఉన్నా చలికాలం మొదలైంది అంటే చాలు చర్మం పగుళ్ళు,పెదాల పగుళ్లు మొదలవుతూ ఉంటాయి.ఇలా పెదాలు పగలడం వల్ల నొప్పిగాను మరియు అందవిహీనంగానూ కనిపిస్తూ ఉంటాయి.ఇంకా చెప్పాలంటే కొంతమందికి పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతు ఉండి,మరింత నొప్పిగా ఉంటుంది.అలా కాకుండా పెదాలు ఎర్రగా,దొండ పండులాగా ఉండాలి అంటే కొన్ని రకాల పద్ధతులను కచ్చితంగా పాటించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.అసలు మన పెదాలని ఈ చలికాలం నుంచి ఎలా కాపాడుకోవాలో మనము తెలుసుకుందాం పదండి..

చలికాలంలో అతిగా చల్లగా ఉండడం వల్ల మనలోని వేడి బయటకు వెదజల్లి చర్మం బ్రేకౌట్స్ అవుతూ ఉంటాయి.ఇలా కాకుండా ఉండాలి అంటే,చలికి ఎక్కువగా చర్మం ఎక్స్పోజ్ కాకుండా బయటికి వెళ్లినప్పుడు స్కార్ప్ వంటిది ధరించడం మరియు మాయిశ్చరైజర్ రాయడం వంటివి కచ్చితంగా చేయాలి. ముఖ్యంగా విటమిన్ ఈ అధికంగా ఉన్న మాయిశ్చరైసర్స్ ని వాడడమే చాలా ఉత్తమం.పెదవులకు లిప్ బామ్ వంటివి కచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది.

మరియు చలికాలంలో అంతగా దాహం వేయదు కానీ శరీరం కాకుండా కచ్చితంగా సరైన మోతాదులో నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం.దీనివల్ల కూడా పెదవులు న్యాచురల్ గా డిహైడ్రెట్ కాకుండా ఉంటాయి.

వీటితోపాటు పెదవులు ఇంట్లో ఉండాలి అంటే అందంగా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు తప్పనిసరి.అందులో ముఖ్యంగా కలబంద గుజ్జు తీసుకొని,అందులో అర స్పూన్ చక్కర,అర స్పూన్ టమాటా గుజ్జు వేసి, కలపాలి.ఇలా వచ్చిన మిశ్రమాన్ని పొడి పెదాలపై అంటించి, అరగంటసేపు ఆరనివ్వాలి.ఆ తర్వాత మెల్లగా మర్దన చేస్తూ శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేసుకొవాలి.దానితో పెదవులపై ఉన్న మృతకాణాలు తొలిగి,పెదవులు మృదువుగా మారుతాయి.ఇందులో ఉపయోగించిన ఆలోవెరా వల్ల పెదవులు హైడ్రెటెడ్ గా ఉంటాయి.బయటకు వెళ్ళేటప్పుడు కచ్చితంగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.సరైనా మొతాదులో నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.

మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ చిట్కా తప్పక పాటించండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>