PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-kasani-become-bit-trouble-for-tdp-in-telangana2fcbbc96-c8e0-4fd1-895c-f7a20d08286f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-kasani-become-bit-trouble-for-tdp-in-telangana2fcbbc96-c8e0-4fd1-895c-f7a20d08286f-415x250-IndiaHerald.jpgసమావేశం తర్వాత నందమూరి బాలకృష్ణతో కాలిసి పార్టీకి బలమున్న నియోజకవర్గాల్లో మాత్రమే పోటీచేస్తామన్నారు. పార్టీ చేయించుకున్న సర్వేలో 85 స్ధానాల్లో బలముందని తేలింది కాబట్టి 85 నియోజకవర్గాల్లోనే పోటీచేస్తుందన్నారు. అన్నీ నియోజకవర్గాల్లోను బాలయ్య ప్రచారం చేస్తారని కూడా చెప్పారు. తర్వాత ఏమైందో తెలీటంలేదు ఇపుడేమో మళ్ళీ అన్నీ నియోజకవర్గాల్లో పోటీకి సై అంటున్నారు. అంటే కాసాని మూడు సందర్భాల్లో మూడు రకాలుగా ప్రకటనలు చేశారు.telangana kasani chandrababu{#}Kamma;Andhra Pradesh;TDP;Party;advertisement;Balakrishna;Marchహైదరాబాద్ : కాసానే కొంపముంచేస్తారా ?హైదరాబాద్ : కాసానే కొంపముంచేస్తారా ?telangana kasani chandrababu{#}Kamma;Andhra Pradesh;TDP;Party;advertisement;Balakrishna;MarchWed, 25 Oct 2023 09:00:00 GMT


తెలంగాణా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరే పార్టీ కొంపముంచేట్లున్నారు. పార్టీ పోటీచేయబోయే నియోజకవర్గాల సంఖ్యపై కాసాని ఒక్కోసారి ఒక్కో లెక్క చెబుతున్నారు. దాంతో తెలుగుదేశంపార్టీపై జనాల్లో బాగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకసారేమో అన్నీ నియోజకవర్గాల్లో పోటీచేస్తామని ప్రకటించారు. అంటే కాసాని ప్రకటన ప్రకారం 119 నియోజకవర్గాల్లోను టీడీపీ పోటీచేయబోతోంది. కాసాని ప్రకటనకు చంద్రబాబునాయుడు ఆమోదం కూడా లభించింది అప్పట్లో. తర్వాత ఇద్దరి మధ్య ఏమైందో ఏమో తెలీదు కానీ ఈమధ్య పార్టీ సమావేశం జరిగింది.





సమావేశం తర్వాత నందమూరి బాలకృష్ణతో కాలిసి పార్టీకి బలమున్న నియోజకవర్గాల్లో మాత్రమే పోటీచేస్తామన్నారు. పార్టీ చేయించుకున్న సర్వేలో 85 స్ధానాల్లో బలముందని తేలింది కాబట్టి 85 నియోజకవర్గాల్లోనే పోటీచేస్తుందన్నారు. అన్నీ నియోజకవర్గాల్లోను బాలయ్య ప్రచారం చేస్తారని కూడా చెప్పారు. తర్వాత ఏమైందో తెలీటంలేదు ఇపుడేమో మళ్ళీ అన్నీ నియోజకవర్గాల్లో పోటీకి సై అంటున్నారు. అంటే కాసాని మూడు సందర్భాల్లో మూడు రకాలుగా ప్రకటనలు చేశారు.





చంద్రబాబు బయటున్నపుడు ఒక ప్రకటన చేసిన కాసాని జైలుకు వెళ్ళినపుడు మరో ప్రకటనచేశారు. తర్వాత జైలు నుండి ఏమి ఆదేశాలు వచ్చాయో తెలీదు కానీ మాట మార్చి 119 నియోజకవర్గాల్లోను పోటీచేస్తుందని ప్రకటించారు. తడవొకొక మాట మార్చటం కాసానికి ఎలాగుందో తెలీదు కానీ పోటీచేయటానికి అభ్యర్ధులు దొరుకుతారా అన్నదే అసలు పాయింట్. వాస్తవం చూస్తే టీడీపీ తరపున పోటీచేయటానికి పెద్దగా ఎవరూ ముందుకు రావటంలేదు. ఎందుకంటే కమ్మ సామాజికవర్గం బలంగాఉన్న నియోజకవర్గాల్లో మాత్రం తలా 5 వేల ఓట్లుంటాయని అంచనా.





ఈ 5 వేల ఓట్లతోనే టీడీపీ గెలుస్తుందా ? మహాయితే గెలుపోటములను డిసైడ్ చేయగలేదేమో అంతే. ఇంతోటిదానికి పోటీకి గట్టినేతలు ఎవరున్నారని జ్ఞానేశ్వర్ పదేపదే ప్రకటనలు మారుస్తున్నారో అర్ధంకావటంలేదు. తెలంగాణా ఎన్నికల్లో గనుక టీడీపీకి ఘోర ఓటమి ఎదురైందంటే దాని ప్రభావం కచ్చితంగా ఏపీ ఎన్నికల్లో కూడా పడుతుంది. ఒంటరిగానే పోటీచేస్తుందని ఒకసారి లేదు లేదు జనసేనతో పొత్తు విషయాన్ని ఆలోచిస్తోందని మరోసారి కాసాని చెబుతున్నారు. మరి పవన్ ఏమిచేస్తారో చూడాల్సిందే.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>