TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/balaya-ratikae987787c-7ec5-4944-9be5-5c4b5a6e140c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/balaya-ratikae987787c-7ec5-4944-9be5-5c4b5a6e140c-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఆడియన్స్ ను గ్లామర్ బ్యూటీగా ఆకట్టుకున్న ఈమె తన అందంతో, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదట్లోనే ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపి తన చుట్టూ తిప్పుకుంది. చేసిందంతా చేసి తీరా ప్లేటు తిప్పి ప్రశాంత్ కు వ్యతిరేకంగా మారిపోయి.. ఘోరంగా అవమానించింది. దీంతో విపరీతమైన నెగెటివిటీని కూడా మూటగట్టుకుంది. మొత్తానికైతే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్లింగ్ కి గురైంది ఈ ముద్దుగుమ్మ. మరొకవైపు టాప్ 5 లBALAYA;RATIKA{#}prasanth;Prashant Kishor;Love;House;Audience;Bigboss;Minister;Heroine;Kesari;Balakrishna;News;BEAUTY;media;Cinemaటీవీ: భగవంత్ కేసరిలో ఐదు నిమిషాల పాత్రకే రతిక భారీ రెమ్యునరేషన్..!టీవీ: భగవంత్ కేసరిలో ఐదు నిమిషాల పాత్రకే రతిక భారీ రెమ్యునరేషన్..!BALAYA;RATIKA{#}prasanth;Prashant Kishor;Love;House;Audience;Bigboss;Minister;Heroine;Kesari;Balakrishna;News;BEAUTY;media;CinemaWed, 25 Oct 2023 02:00:00 GMTబిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఆడియన్స్ ను గ్లామర్ బ్యూటీగా ఆకట్టుకున్న ఈమె తన అందంతో, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదట్లోనే ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపి తన చుట్టూ తిప్పుకుంది. చేసిందంతా చేసి తీరా ప్లేటు తిప్పి ప్రశాంత్ కు వ్యతిరేకంగా మారిపోయి.. ఘోరంగా అవమానించింది. దీంతో విపరీతమైన నెగెటివిటీని కూడా మూటగట్టుకుంది. మొత్తానికైతే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్లింగ్ కి గురైంది ఈ ముద్దుగుమ్మ.

మరొకవైపు టాప్ 5 లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ నాలుగో వారమే ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చింది.  ఇకపోతే ఈమె ఎలిమినేట్ అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నిన్న మళ్ళీ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాలో మంత్రి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.  ఇందులో రతిక ఐదు నిమిషాల పాటు కనిపించింది. ఈ క్రమంలోనే భగవంత్ కేసరి సినిమా కోసం అందులో నటించిన ఐదు నిమిషాల పాత్ర కోసం ఏకంగా లక్షల్లో పారితోషకం తీసుకుందట.

కేవలం ఐదు నిమిషాల కోసం రూ.2 లక్షల పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బాలయ్య సినిమాలో రతిక కనిపించేసరికి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయింది. అంతకు ముందు చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈమె ఇప్పుడు రాఘవేందర్రావు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోందట. ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇకపై తన ప్రవర్తనతో ఆడియన్స్  ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>