MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodee526f04-8351-4fa4-9c2f-a64cdf7a5729-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodee526f04-8351-4fa4-9c2f-a64cdf7a5729-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా విభిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే తాజాగా ఇప్పుడు జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కార్తీ 25వ సినిమాగా ఈ సినిమా రానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జోకర్ ఫేమ్ మురుగన్ దర్శకత్వ వహిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ఇదిలా ఉంటే tollywood{#}annapurna;Joker;Japan;Variar;sithara;king;King;media;Telugu;Akkineni Nagarjuna;Hero;Chitram;Cinemaనాగార్జున చేతికి కార్తీ సినిమా..!!నాగార్జున చేతికి కార్తీ సినిమా..!!tollywood{#}annapurna;Joker;Japan;Variar;sithara;king;King;media;Telugu;Akkineni Nagarjuna;Hero;Chitram;CinemaTue, 24 Oct 2023 15:36:51 GMTహీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు  కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా విభిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే తాజాగా ఇప్పుడు జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కార్తీ 25వ సినిమాగా ఈ సినిమా రానుంది.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జోకర్ ఫేమ్ మురుగన్ దర్శకత్వ వహిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తెలుగు రైట్స్ ని కింగ్ నాగార్జున దక్కించుకున్నారు. నాగ్ అండర్ లో నడిచే అన్నపూర్ణ స్టూడియోస్ 'జపాన్' తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేట్ కి సొంతం

 చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ కార్తీ సినిమాని దక్కించుకోవడంతో తెలుగులోనూ 'జపాన్' గ్రాండ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈమధ్య ఇతర భాషల సినిమాలను సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంటే కార్తీ 'జపాన్' తెలుగు రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకోవడం విశేషం. అగ్ర నిర్మాణ సంస్థలకు కాకుండా నాగార్జున కి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ కి కార్తీ జపాన్ తెలుగు రైట్స్ ఇవ్వడం వెనక ఓ రీజన్ ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

 అదేంటంటే, కార్తీతో నాగార్జునకి మంచి బాండింగ్ ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో 'ఊపిరి' అనే ఎమోషనల్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే కదా. ఊపిరి టైం నుంచి కార్తీక, నాగార్జున మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. కార్తీ నటించిన ప్రతి సినిమాకి నాగార్జున తన బెస్ట్ విషెస్ అందిస్తారు. ఈ క్రమంలోనే కార్తీ నటించిన 'జపాన్' సినిమా తెలుగు హక్కులను నాగార్జున భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>