Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaffcec73-e0ad-4f6f-b507-ccd765f109be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaffcec73-e0ad-4f6f-b507-ccd765f109be-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమ ఒకరి సొత్తు కాదు.. ఎవరైనా రావచ్చు సత్తా చాటోచ్చు అని నిరూపించిన నటుడు సంపూర్ణేష్ బాబు.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బర్నింగ్ స్టార్ గా బాగా దగ్గరయ్యాడు. ఇక ఎన్నో కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపు బాగా నవ్వించాడు సంపూర్ణేష్ బాబు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం సినిమాలు విషయంలో కాస్త డల్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచి వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. మొన్నటి లాగా అటు కామెడీ సినిమాల మీద మాత్రమే ఆధారపడకుండా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నాడు అని చెపTollywood{#}Akkineni Nagarjuna;manmohan;sampoornesh babu;Industries;Comedy;Success;Posters;Tammudu;Thammudu;kalyan;Audience;Telugu;king;King;Chiranjeevi;Cinemaచిరంజీవి బాటలో.. సంపూర్ణేష్ బాబు.. ఏం చేస్తున్నాడంటే?చిరంజీవి బాటలో.. సంపూర్ణేష్ బాబు.. ఏం చేస్తున్నాడంటే?Tollywood{#}Akkineni Nagarjuna;manmohan;sampoornesh babu;Industries;Comedy;Success;Posters;Tammudu;Thammudu;kalyan;Audience;Telugu;king;King;Chiranjeevi;CinemaTue, 24 Oct 2023 19:15:00 GMTచిత్ర పరిశ్రమ ఒకరి సొత్తు కాదు.. ఎవరైనా రావచ్చు సత్తా చాటోచ్చు అని నిరూపించిన నటుడు సంపూర్ణేష్ బాబు.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బర్నింగ్ స్టార్ గా బాగా దగ్గరయ్యాడు. ఇక ఎన్నో కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపు బాగా నవ్వించాడు సంపూర్ణేష్ బాబు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం సినిమాలు విషయంలో కాస్త డల్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచి వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. మొన్నటి లాగా అటు కామెడీ సినిమాల మీద మాత్రమే ఆధారపడకుండా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సరికొత్తగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మరికొన్ని రోజుల్లో మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుత జనరేషన్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి. రాజకీయ నాయకులు ప్రజలను ఎలా మభ్యపెడుతున్నారు అనే ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది అని చెప్పాలి. ఇక అంతేకాకుండా మరో వెరైటీ చిత్రంలో కూడా నటిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలా సినిమాలు సక్సెస్ సాధించాయి.


 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఇదే ఫార్ములాతో సంపూర్ణేష్ బాబు, సంజోష్ హీరోలుగా మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో సోదర అనే మూవీ రూపుదిద్దుకుంటుంది. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్, మార్క్ ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం  ఒక మోషన్ పోస్టర్ని రిలీజ్ చేసింది.


 ఇక ఈ పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు సంజోష్ లు ఎంతో ఆప్యాయంగా కలిసి ఉన్న ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. అయితే గతంలో ఇలా అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో చాలా మంది స్టార్ హీరోలే సినిమాలు తీశారు   చిరంజీవి నటించిన అన్నయ్య, నాగార్జున నటించిన సీతారామరాజు, పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు మూవీలో ఇలా అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ సాధించాయి అని చెప్పాలి. ఇప్పుడు ఈ స్టార్ హీరోల బాటలోనే ప్రస్తుతం బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>