EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan3232d8e0-670d-4e1c-90d5-c62e3ec2fade-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan3232d8e0-670d-4e1c-90d5-c62e3ec2fade-415x250-IndiaHerald.jpgపవన్‌ కల్యాణ్‌ను టీడీపీ నేతలు రిసీవ్‌ చేసుకుంటుంటే లోకేశ్‌ ముఖం మాడిపోయిందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వేదికంతా చూస్తే సీనియర్‌ నాయకులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించిన తీరు చూస్తే లోకేశ్‌ కిమ్మనలేకపోయాడని.. వచ్చేశాడు, మా దత్తపుత్రుడు వచ్చేశాడని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నూటికి నూరు పాళ్లు టీడీపీ బలహీనపడిందని ఎప్పుడో చెప్పిన పవన్‌ కల్యాణ్‌ దాన్ని బలోపేతం చేయడం కోసం ఈ రోజు కలిశాను అని స్పష్టంగా చెప్పారని మంత్రి PAWAN{#}Yanamala Ramakrishnudu;TDP;court;CBN;Ministerపవన్‌కు టీడీపీ గ్రాండ్‌ వెల్కమ్‌..లోకేష్‌ ముఖం మాడిందా?పవన్‌కు టీడీపీ గ్రాండ్‌ వెల్కమ్‌..లోకేష్‌ ముఖం మాడిందా?PAWAN{#}Yanamala Ramakrishnudu;TDP;court;CBN;MinisterTue, 24 Oct 2023 09:00:00 GMTపవన్‌ కల్యాణ్‌ను టీడీపీ నేతలు రిసీవ్‌ చేసుకుంటుంటే లోకేశ్‌ ముఖం మాడిపోయిందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వేదికంతా చూస్తే సీనియర్‌ నాయకులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించిన తీరు చూస్తే లోకేశ్‌ కిమ్మన లేకపోయాడని.. వచ్చేశాడు, మా దత్తపుత్రుడు వచ్చేశాడని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.


నూటికి నూరు పాళ్లు టీడీపీ బలహీన పడిందని ఎప్పుడో చెప్పిన పవన్‌ కల్యాణ్‌ దాన్ని బలోపేతం చేయడం కోసం ఈ రోజు కలిశాను అని స్పష్టంగా చెప్పారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్ని సున్నాలు కలిసినా అది సున్నానే తప్ప బలమైన వ్యవస్థగా మారదని అన్నారు. చంద్రబాబుకు బెయిల్‌ రాకుండా చేస్తున్నారంటూ పవన్‌ అంటున్నారని..  అసలు పవన్‌ నీకు వ్యవస్థలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.


ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్‌ బెయిల్‌ ఇవ్వొద్దనే చెప్తారని... న్యాయస్థానాలు తగిన నిర్ణయం తీసుకుంటాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కోర్టు వ్యవహారాల గురించి తెలియకపోతే తెలుసుకో పవన్‌ కల్యాణ్‌ అంటూ సూచించారు. చంద్రబాబు అరెస్ట్‌ అక్రమని అనాలంటే కేసు అయినానా కొట్టేయాలి.. లేదా క్వాష్‌ పిటిషన్‌ అయినానా అనుమతించాలని మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు.


చంద్ర బాబును అన్ని ఆధారాలతో సహా అరెస్ట్‌ చేసి కోర్టులో పెడితే జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఇచ్చారని.. ఏ కోర్టుకు వెళ్లినా పిటిషన్లు తిరస్కరిస్తున్నారంటే కేసు ఎంత బలంగా ఉందో అర్ధం అవుతోందని.. దీనికి ప్రభుత్వంపై, జగన్‌ గారిపై విరుచుకు పడితే ఏం లాభమని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీని కాపాడటం కోసం పవన్ భుజాన వేసుకునే కార్యక్రమం తప్ప మరొకటి కాదని.. మీరంతా కలిసే వస్తారని మేం డే వన్‌ నుంచీ చెప్తున్నామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>