MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna2661f95c-072a-4203-8de6-5839c90363db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna2661f95c-072a-4203-8de6-5839c90363db-415x250-IndiaHerald.jpgహిట్ డైరెక్టర్ గా తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపుడి. పటాస్ నుంచి రీసెంట్ రిలీజ్ భగవంత్ కేసరి దాకా తను ఏ సినిమా చేసినా టాక్ తో సంబంధం లేకుండా హిట్లు కొట్టాడు అనిల్ రావి పూడి.ఈ క్రమంలో అనిల్ చేసిన భగవంత్ కేసరి సినిమా మీద స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఒక స్టార్ హీరోతో చేసే కమర్షియల్ సినిమాలో సోషల్ మెసేజ్ కూడా ఇవ్వడం అనేది చాలా అరుదు. అన్ని విభాగాలు పర్ఫెక్ట్ గా సెట్ అయితేనే ఆ సినిమాలు హిట్ అవుతాయి. ఇక భగవంత్ కేసరి సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అనిల్ రావిపుడి దర్శకత్వBala Krishna{#}Balakrishna;anil music;anil ravipudi;sree;Kesari;Yuva;Pataas;Josh;Bobby;Pattas;Prize;Nijam;Director;Cinemaభగవంత్ కేసరికి సూపర్ వసూళ్లు.. కాంబో రిపీట్?భగవంత్ కేసరికి సూపర్ వసూళ్లు.. కాంబో రిపీట్?Bala Krishna{#}Balakrishna;anil music;anil ravipudi;sree;Kesari;Yuva;Pataas;Josh;Bobby;Pattas;Prize;Nijam;Director;CinemaTue, 24 Oct 2023 17:43:00 GMTహిట్ డైరెక్టర్ గా తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపుడి. పటాస్ నుంచి రీసెంట్ రిలీజ్ భగవంత్ కేసరి దాకా తను ఏ సినిమా చేసినా టాక్ తో సంబంధం లేకుండా హిట్లు కొట్టాడు అనిల్ రావి పూడి.ఈ క్రమంలో అనిల్ చేసిన భగవంత్ కేసరి సినిమా మీద స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఒక స్టార్ హీరోతో చేసే కమర్షియల్ సినిమాలో సోషల్ మెసేజ్ కూడా ఇవ్వడం అనేది చాలా అరుదు. అన్ని విభాగాలు పర్ఫెక్ట్ గా సెట్ అయితేనే ఆ సినిమాలు హిట్ అవుతాయి. ఇక భగవంత్ కేసరి సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అనిల్ రావిపుడి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ఈ డిఫరెంట్ అటెంప్ట్ కేవలం నందమూరి ఫ్యాన్స్ ని మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడిని కూడా సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రీ లీల మధ్య వచ్చే సీన్స్ అయితే ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి.


సినిమా ఇప్పటిదాకా 37 కోట్ల షేర్ ఇంకా 66 కోట్ల గ్రాస్ రాబట్టి 55% బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 68 కోట్లు. ఇంకా 32 కోట్లు షేర్ వస్తే ఈ సినిమా సేఫ్ అవుతుంది. టాక్ బాగుంది కాబట్టి ఇంకా కొన్ని రోజుల్లో ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యిద్ది. ఇక బాలకృష్ణతో 100వ సినిమానే చేయాల్సిన అనిల్ రావిపుడి 108వ సినిమా చేయాల్సి వచ్చింది. అనిల్ రావిపూడి  బాలకృష్ణ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు.అందుకే భగవంత్ కేసరి సక్సెస్ జోష్ లో ఉన్న బాలయ్య అనిల్ తో మరో సినిమా చేసేందుకు రెడీ అంటున్నాడట.బాలకృష్ణకు ఇంత మెమరబుల్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపుడితో వెంటనే మరో సినిమా చేసేందుకు బాలయ్య ఆసక్తి చూపిస్తున్నారట. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో బాలయ్య సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత మళ్లీ అనిల్ రావిపుడితోనే బాలకృష్ణ సినిమా ఉంటుందని చెబుతున్నారు. హిట్ కాంబో కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఖచ్చితంగా భారీగా ఉంటాయి. ఈసారి అనిల్ బాలకృష్ణతో ఎలాంటి కథతో వస్తారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>