EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/amithsha8a808c7f-20a6-4b9e-a105-18366d9275cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/amithsha8a808c7f-20a6-4b9e-a105-18366d9275cc-415x250-IndiaHerald.jpgకొన్ని రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను టీడీపీ నేత నారా లోకేశ్ ఢిల్లీలో ఆయన ఇంట్లో కలిసిన సంగతి తెలిసిందే. ఆ భేటీ తర్వాత దానిపై నారా లోకేశ్ స్పందిస్తూ.. అమిత్‌షా పిలిచారని.. నేను వెళ్లి మాట్లాడానని చెప్పుకొచ్చారు. అంటే.. ఆయన పిలిస్తే వెళ్లాను తప్ప.. తనంతట తాను వెళ్లలేదనే అర్థంలో చెప్పారు. అయితే వాస్తవానికి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం చంద్రబాబును అరెస్టు చేసిన మొదట్లో నారా లోకేశ్ డిల్లీలో మకాం వేసి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే.. ఎందుకో తెలియదు కానీ.. అమిత్ షా.. నారా లోకేశ్‌ను కలిAMITHSHA{#}Amith Shah;Amit Shah;YCP;Nara Lokesh;TDP;CBN;G Kishan Reddy;Reddy;Minister;central governmentఅమిత్‌షా, లోకేశ్‌ భేటీ.. అసలు రహస్యం ఇదా?అమిత్‌షా, లోకేశ్‌ భేటీ.. అసలు రహస్యం ఇదా?AMITHSHA{#}Amith Shah;Amit Shah;YCP;Nara Lokesh;TDP;CBN;G Kishan Reddy;Reddy;Minister;central governmentTue, 24 Oct 2023 09:00:00 GMTకొన్ని రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను టీడీపీ నేత నారా లోకేశ్ ఢిల్లీలో ఆయన ఇంట్లో కలిసిన సంగతి తెలిసిందే. ఆ భేటీ తర్వాత దానిపై నారా లోకేశ్ స్పందిస్తూ.. అమిత్‌షా పిలిచారని.. నేను వెళ్లి మాట్లాడానని చెప్పుకొచ్చారు. అంటే.. ఆయన పిలిస్తే వెళ్లాను తప్ప.. తనంతట తాను వెళ్లలేదనే అర్థంలో చెప్పారు. అయితే వాస్తవానికి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం చంద్రబాబును అరెస్టు చేసిన మొదట్లో నారా లోకేశ్ డిల్లీలో మకాం వేసి చాలా ప్రయత్నాలు చేశారు.


అయితే.. ఎందుకో తెలియదు కానీ.. అమిత్ షా.. నారా లోకేశ్‌ను కలిసేందుకు ఆసక్తి చూపించలేదు. దాదాపు 15 రోజుల వరకు ఢిల్లీలోనే మకాం వేసిన నారా లోకేశ్.. చివరకు మోదీని కానీ.. అమిత్ షా ను కానీ కలవకుండానే వెనక్కు వచ్చేశారు. వచ్చేసిన చాలా రోజులకు అనూహ్యంగా  ఆయనకు అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. దీనివెనుక ఏం జరిగిందన్నది ఆసక్తి కరంగా మారింది. తాజాగా కిషన్ రెడ్డి నారా లోకేశ్‌ అపాయింట్‌మెంట్ పై మాట్లాడుతూ అసలు విషయం బయటపెట్టారు.


అమిత్‌షాను కలపమని ఢిల్లీలో ఉండి ప్రాథేయపడితే తాను అపాయింట్‌ మెంట్‌ ఇప్పించానని కిషన్‌ రెడ్డి ఇటీవల చెప్పారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు.. శతృవులను సైతం అమిత్‌షా కలుస్తారని కూడా కిషన్ రెడ్డి చెప్పారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు.. కేసు ఏ బెంచ్‌కి వచ్చింది...ఏ జడ్జి దగ్గర ఉంది అని కూడా అమిత్ షా అడిగారని లోకేశ్‌ చెప్పుకున్నారని.. ఇలాంటి తప్పుడు విధానాల వల్ల మీ డొల్లతనం బయపటడుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.


అంతే కాదు.. తాజాగా రాజమండ్రిలో కలిసినటువంటి కలయిక చరితాత్మకమైన కలయిక అంటున్నారని..కానీ..  అసలు మీరెప్పుడైనా విడిపోయి ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇవాళేదో కొత్తగా కలిసినట్లు మాట్లాడుతున్నారని..కానీ వారు ఎప్పుడూ కలిసే ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రజల సమస్యల కోసం చర్చించామంటున్న జనసేన, టీడీపీ నేతలకు.. చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత ప్రజా సమస్యలు గుర్తొచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>