Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshb0c5d097-f6e9-49eb-bb3f-e6d7380181ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshb0c5d097-f6e9-49eb-bb3f-e6d7380181ec-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ప్రేక్షకుల పంథా పూర్తిగా మారిపోయింది. ఎంతటి స్టార్ హీరో సినిమాలో నటించిన కథ బలంగా ఉంటేనే మంచి విజయాలను అందిస్తున్నారు. లేదంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు కూడా ఫ్లాపులు తప్పడం లేదు. దీంతో స్టార్ హీరోలు అందరూ కూడా తాము చేసే సినిమాలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. డైరెక్టర్ వినిపించిన కథ ఏదైనా తేడా కొట్టింది అంటే చాలు నిర్మొహమాటంగా ముఖం మీదనే నో చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాకుండా ఫ్లాప్స్ ట్రాక్ ఉన్న డైరెక్టర్ లతో ఏ స్టార్ హీరో కూడా సినిమా చేసేందుకు ముందుకు రావటMahesh{#}meher ramesh;trivikram srinivas;Guntur;mahesh babu;Telugu;India;Hero;Director;Cinemaకథ నచ్చినా.. మహేష్ ఆ మూవీ రిజెక్ట్ చేశాడట తెలుసా?కథ నచ్చినా.. మహేష్ ఆ మూవీ రిజెక్ట్ చేశాడట తెలుసా?Mahesh{#}meher ramesh;trivikram srinivas;Guntur;mahesh babu;Telugu;India;Hero;Director;CinemaTue, 24 Oct 2023 19:00:00 GMTఇటీవల కాలంలో ప్రేక్షకుల పంథా పూర్తిగా మారిపోయింది. ఎంతటి స్టార్ హీరో సినిమాలో నటించిన కథ బలంగా ఉంటేనే మంచి విజయాలను అందిస్తున్నారు. లేదంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు కూడా ఫ్లాపులు తప్పడం లేదు. దీంతో స్టార్ హీరోలు అందరూ కూడా తాము చేసే సినిమాలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. డైరెక్టర్ వినిపించిన కథ ఏదైనా తేడా కొట్టింది అంటే చాలు నిర్మొహమాటంగా ముఖం మీదనే నో చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాకుండా ఫ్లాప్స్ ట్రాక్ ఉన్న డైరెక్టర్ లతో ఏ స్టార్ హీరో కూడా సినిమా చేసేందుకు ముందుకు రావట్లేదు.



 పాన్ ఇండియా హిట్టు కొట్టిన దర్శకుడితో సినిమా కమిట్ అవుతున్న వారే ఎక్కువగా నేటి రోజుల్లో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు కూడా ఇదే బాటలో వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల తన దగ్గరికి వచ్చిన ఒక భారీ ఆఫర్ని సైతం మహేష్ బాబు డైరెక్టర్ కారణంగా రిజెక్ట్ చేశాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాతో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత రాజమౌళితో ఒక సినిమాతో బిజీ అవ్వబోతున్నాడు అని చెప్పాలి


 ఈ క్రమంలోనే మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని మెహర్ రమేష్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇటీవల ఒక మంచి కథతో మహేష్ దగ్గరకు వెళ్ళాడట. అయితే కథ మహేష్ బాబుకు నచ్చినప్పటికీ మెహర్ రమేష్ కు ఉన్న ఫ్లాప్ ట్రాక్ కారణంగా భయపడిపోయాడట ఈ హీరో. అసలే రాజమౌళితో సినిమాలో నటించాక ఏ సినిమా చేసిన ప్లాప్ అవుతుందని బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. దీంతో ఇక తర్వాత మెహర్ రమేష్ తో సినిమా అంటే ఇక అతనికి ముందే వరుస ప్లాప్ లు ఉన్నాయి. ఇక ఇప్పుడు తెలిసి కూడా సినిమా చేస్తే కెరియర్ మొత్తం నాశనం అవుతుందని మహేష్ బాబు రిజెక్ట్ చేశాడట  అయితే ఈ విషయం తెలిసి కొంతమంది నెగటివ్గా స్పందిస్తున్నారు. ట్రాక్ రికార్డు ఇంపార్టెంట్ కాదు కథ ఇంపార్టెంట్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>