Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle52c2ae96-6737-4a7f-ba50-b8e148db3494-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle52c2ae96-6737-4a7f-ba50-b8e148db3494-415x250-IndiaHerald.jpgమెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రల్లో ఆదికేశవ్ సినిమా వస్తోంది. శ్రీకాంత్ ఎన్.రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. నవంబర్ 10న ఆదికేశవ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఆదికేశవ సినిమా నుంచి మూడో సాంగ్ రెడీ అయింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మూవీ యూనిట్ నేడు (అక్టోబర్ 24) రిలీజ్ చేసింది. పూర్తి సాంగ్ రిలీజ్ డేట్, టైమ్‍ను కూడా ప్రకటించింది.ఆదికేశవ చిత్రం నుంచిsocialstars lifestyle{#}Kumaar;kasarla shyam;prasad;srikanth;Evening;Vaishnav Tej;Hero;Mass;Chitram;Heroine;November;Cinemaలిరికల్ మాస్ సాంగ్ విడుదల తేదిని ప్రకటించిన ఆదికేశవ మూవీ టీం....!!లిరికల్ మాస్ సాంగ్ విడుదల తేదిని ప్రకటించిన ఆదికేశవ మూవీ టీం....!!socialstars lifestyle{#}Kumaar;kasarla shyam;prasad;srikanth;Evening;Vaishnav Tej;Hero;Mass;Chitram;Heroine;November;CinemaTue, 24 Oct 2023 22:39:00 GMTమెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రల్లో ఆదికేశవ్ సినిమా వస్తోంది. శ్రీకాంత్ ఎన్.రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. నవంబర్ 10న ఆదికేశవ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఆదికేశవ సినిమా నుంచి మూడో సాంగ్ రెడీ అయింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మూవీ యూనిట్ నేడు (అక్టోబర్ 24) రిలీజ్ చేసింది. పూర్తి సాంగ్ రిలీజ్ డేట్, టైమ్‍ను కూడా ప్రకటించింది.ఆదికేశవ చిత్రం నుంచి 'లీలమ్మో' అనే మూడో పాట ప్రోమో వచ్చేసింది. మాస్ బీట్‍తో ఫుల్ జోష్‍గా ఈ సాంగ్ ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాటకు దుమ్ములేచిపోయే బీట్ ఇచ్చారు. "బావయ్యో బావయ్యో వస్తావా" అంటూ లీలమ్మో పాట మొదలైంది. ఈ పాటను నకాష్ అజీజ్, ఇంద్రావతి చౌహాన్ పాడారు. కాసర్ల శ్యామ్ రిలిక్స్ అందించారు.ఈ లీలమ్మో పాట ప్రోమోలో శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్ చేశారు. తన మార్క్ గ్రేస్‍తో స్టెప్స్ ఇరగదీశారు. హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఆకట్టుకున్నారు. మొత్తంగా మంచి ఊపున్న బీట్‍తో ఈ పాట ఉంది. లీలమ్మో ఫుల్ రిలికల్ సాంగ్‍ను రేపు (అక్టోబర్ 25) సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు సితారా ఎంటర్‌టైన్‍మెంట్స్ వెల్లడించింది. మాస్+ఎనర్జీ గ్లింప్స్ అంటూ ఈ ప్రోమోను పోస్ట్ చేసింది.

ఆదికేశవ సినిమాలో అపర్ణా దాస్ మరో హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మెలోడియస్‍గా ఉన్నాయి. అయితే, ఈ మూడో పాట మాత్రం జోష్‍గా మాస్ బీట్‍తో ఉంది.సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై ఆదికేశవ చిత్రాన్ని నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు. డడ్లీ, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న ఈ చిత్రానికి నవీన్ నూలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ ఆ రేంజ్‍లో హిట్ అందుకోలేకపోయారు. కొండపొలం, రంగరంగ వైభవంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. దీంతో ఆదికేశవ చిత్రంపై వైష్ణవ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నట్టు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>