MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani261fa82a-f793-477c-a7ac-5a9c2ca341f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani261fa82a-f793-477c-a7ac-5a9c2ca341f0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది మార్చిలో దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. తనని తాను స్టార్ గ ప్రూవ్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్న నాని దసరా సినిమాతో 100 కోట్ల కలని కూడా నిజం చేసుకున్నాడు.దసరా ఇచ్చిన హిట్టుతో తన కెరీర్ ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నాడు నాని. ప్రస్తుతం కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో హాయ్ నాన్న సినిమాతో రాబోతున్నాడు నాని. నాని మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న ఈ ఎమోషనల్ మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్Nani{#}Nani;editor mohan;priyanka;surya sivakumar;vivek;Saturday;Prize;Heroine;Darsakudu;Nijam;Mass;Hero;Director;Father;Tamil;Dussehra;Cinema;India;Vijayadashamiసరిపోదా శనివారం: నాని ప్లాన్ సూపర్ ?సరిపోదా శనివారం: నాని ప్లాన్ సూపర్ ?Nani{#}Nani;editor mohan;priyanka;surya sivakumar;vivek;Saturday;Prize;Heroine;Darsakudu;Nijam;Mass;Hero;Director;Father;Tamil;Dussehra;Cinema;India;VijayadashamiTue, 24 Oct 2023 17:26:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది మార్చిలో దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. తనని తాను స్టార్ గ ప్రూవ్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్న నాని దసరా సినిమాతో 100 కోట్ల కలని కూడా నిజం చేసుకున్నాడు.దసరా ఇచ్చిన హిట్టుతో తన కెరీర్ ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నాడు నాని. ప్రస్తుతం కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో హాయ్ నాన్న సినిమాతో రాబోతున్నాడు నాని. నాని మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న ఈ ఎమోషనల్ మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నాని. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సరిపోదా శనివారం అంటూ టీజర్ తోనే సర్ ప్రైజ్ చేశాడు న్యాచురల్ స్టార్ నాని. దసరా సినిమాతో తను కూడా మాస్ సినిమాలు చేయగలనని ప్రూవ్ చేసిన నాని వెంటనే హాయ్ నాన్న అంటూ మళ్లీ తన మార్క్ ఎమోషనల్ సినిమాని చేస్తున్నాడు. ఆ వెంటనే వివేక్ తో రెండోసారి మంచి మాస్ సినిమా చేస్తున్నాడు.సరిపోదా శనివారం  టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు డైరెక్టర్ వివేక్.


వివేక్ ఇదివరకు చేసిన 3 సినిమాలకు భిన్నంగా ఈసారి కమర్షియల్ ఫార్మెట్ లో ఈ సినిమా ఉంటుందని పూర్తిగా అర్ధమవుతుంది. వివేక్ ఆత్రేయ నాని కాంబోలో వస్తున్న ఈ సెకండ్ సినిమా కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. దసరా తర్వాత సినిమాల విషయంలో తన పంథా మార్చేసిన నాని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు.దసరా సినిమా తర్వాత హాయ్ నాన్న కూల్ అండ్ ఎమోషనల్ మూవీగా వస్తుండగా మళ్లీ దసరా టైప్ లో మరో మాస్ సినిమాగా సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ గా ప్లాన్ చేశారు. ఈ లెక్కన నాని కూడా పాన్ ఇండియా మార్కెట్ పైన పూర్తిగా కన్నేశాడని చెప్పొచ్చు. సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా తమిళ హీరో ఎస్.జె సూర్య నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఓ స్టార్ సర్ప్రైజ్ ఎంట్రీ కూడా ఉంటుందట. మొత్తానికి నాని ఈసారి పెద్ద స్కెచ్ తోనే రంగంలోకి దిగుతున్నాడని అనిపిస్తుంది. మరి న్యాచురల్ స్టార్ ప్లానింగ్ ఎంతవరకు ప్రేక్షకుల మెప్పు పొందుతుందనేది చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>